ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో భక్తుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో టచ్‌స్క్రీన్ సౌకర్యంతో కూడిన వంద కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కియోస్క్‌ల ద్వారా భక్తులు నేరుగా దర్శనం, సేవల టికెట్లను సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు.
కరూర్ వైశ్యా బ్యాంకు సహకారం
ఈ కియోస్క్‌లను కరూర్ వైశ్యా బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) ప్రాజెక్ట్‌గా ఉచితంగా అందిస్తూ, ఇన్స్టలేషన్, నిర్వహణ భారం కూడా బ్యాంక్ మీదే ఉంటుంది. భక్తులు తమకు కావలసిన టికెట్లు ఎంచుకుని డిజిటల్ పేమెంట్ చేయగలరు. వెంటనే టికెట్లు వారి చేతికి అందతాయి. దీని వలన ఆలయాల్లో క్యూలైన్లలో నిలబడాల్సిన సమస్యలు తగ్గిపోతాయి.
ప్రధాన ఆలయాల్లో కియోస్క్‌ల ఏర్పాటు
ఈ కొత్త కియోస్క్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన ఆలయాల్లో ఏర్పాటు చేయబడతాయి. వాటిలో ముఖ్యమైనవి:
-
విజయవాడ కనకదుర్గమ్మ
-
శ్రీశైలం
-
సింహాచలమ్
-
శ్రీకాళహస్తి
-
అన్నవరం
-
ద్వారకతిరుమల
-
కాణిపాకం
ఈ ఆలయాల్లో 8 కియోస్క్‌లు సేవలు అందించనున్నాయి. ఈ కింది తెలిపిన ఆలయాల్లో మూడు చొప్పున కియోస్క్‌లు ఏర్పాటు చేస్తారు.
డిజిటల్ చెల్లింపుల నిర్వహణ
భక్తులు ఈ కియోస్క్‌లలో డిజిటల్ పద్ధతిలో చెల్లించిన మొత్తం డబ్బులు ప్రత్యేక బ్యాంక్ ఖాతాల్లో నిల్వ చేయడం కోసం, ఆలయాల పేరుతో కరూర్ వైశ్యా బ్యాంకులో ఈవోలు వేర్వేరుగా ఖాతాలు ఓపెన్ చేయాలనేది దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సూచించారు. ఈ చర్య వల్ల ఆలయ నిర్వహణకు సహాయం అవుతుంది, పారదర్శకత పెరుగుతుంది.