అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ 50.4% ఓట్లను సాధించి విజయం సాధించారు. న్యూయార్క్ మాజీ గవర్నర్, స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ క్యూమో 41% లేదా దాదాపు 850,000 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. రిపబ్లికన్ కర్టిస్ స్లివా 7.1% లేదా దాదాపు 145,000 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
మమ్దానీ సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు. ఆయన న్యూయార్క్‌లో అతి పిన్న వయస్కుడైన మేయర్. మొదటి భారతీయ-అమెరికన్. 100 సంవత్సరాలలో మొదటి ముస్లిం మేయర్ అవుతారు. తన విజయం తర్వాత, మమ్దానీ న్యూయార్క్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ట్రంప్‌నకు హెచ్చరిక జారీ చేశారు.
మమ్దానీ ట్రంప్‌కు జన్మనిచ్చిన నగరం ఇప్పుడు దేశానికి అతన్ని ఎలా ఓడించాలో చూపిస్తుంది. డోనాల్డ్ ట్రంప్, మీరు దీన్ని చూస్తున్నారని నాకు తెలుసు. నా దగ్గర మీకు నాలుగు మాటలు ఉన్నాయి: వాల్యూమ్ పెంచండి అని అన్నారు-
బిల్ క్లింటన్ దంపతుల అభినందనలు . .
న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభినందించారు. "జోహ్రాన్ మమ్దానీ, న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైనందుకు అభినందనలు. మీ ప్రచారంలోని ఉత్సాహం, అభిరుచిని అందరికీ మెరుగైన, న్యాయమైన, మరింత అందుబాటులో ఉండే న్యూయార్క్‌ను నిర్మించడానికి ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.
బిల్ క్లింటన్ భార్య మ- మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ కూడా సోషల్ మీడియాలో మమ్దానీని అభినందించారు. "గత 50 సంవత్సరాలలో కంటే ఈ సంవత్సరం న్యూయార్క్ నగరంలో ఎక్కువ మంది ఓటు వేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విజయం మరియు జోహ్రాన్ మమ్దానీ స్ఫూర్తిదాయక ప్రచారానికి నిదర్శనం. ప్రపంచంలోని గొప్ప నగరానికి తదుపరి మేయర్‌కు అభినందనలు!" అంటూ ఆమె అభినందనలు తెలిపారు.