మంచు కుటుంబం నుంచి ప్రతిష్టాత్మకంగా వస్తున్న మూవీ కన్నప్ప. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్యకాలంలో మంచు కుటుంబ చిత్రాలపై పెద్దగా అంచనాలు ఉండడంలేదు. కానీ కన్నప్ప విషయంలో మాత్రం అలా కాదు. భారీ హైప్ ఈ మూవీపై ఇప్పటికే ఉంది. ఇక మూవీ ప్రీరిలీజ్ వేడుక అద్భుతంగా నిర్వహించారు. ఈ మూవీలో ప్రభాస్ కూడా ఉండడంతో పెద్ద స్థాయిలో కన్నప్ప మూవీ చర్చనీయాంశంగా మారడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అలాగే, ప్రభాస్ తో పాటు చాలా మంది స్టార్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, చిత్ర యూనిట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఇక ప్రభాస్ ఎంత క్రేజీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత, ప్రభాస్ కటౌట్ మారిపోయింది. ప్రభాస్ సినిమా విడుదల చేసినప్పుడల్లా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు దాని కోసం ఎదురు చూస్తున్నారు. కన్నప్ప సినిమాపై పెరుగుతున్న అంచనాలకు ప్రభాస్ కూడా అతి పెద్ద కారణం. అయితే, కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఎంత సేపు ఉంటాడు? ఎప్పుడు కనిపిస్తాడో అనే ఆసక్తి చాలా మందికి ఉంది. కన్నప్ప ఈవెంట్లో రచయిత బివిఎస్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. సెకండ్ హాఫ్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ సీన్ సరిగ్గా 15-16 నిమిషాల తర్వాత ఉంటుందని ఆయన అన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా కనిపిస్తారు. ట్రైలర్లో ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా కనిపించాయి. ఇది ప్రభాస్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు రవి చెప్పిన విశేషాలతో ప్రభాస్ అభిమానులు ఊగిపోతున్నారు. రుద్రుడిగా ప్రభాస్ సినిమాకి ప్రాణం పోసాడని సినిమా యూనిట్ నుంచి వస్తున్న వార్తలతో ప్రభాస్ అభిమానులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.