అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారు. అయితే, కొన్ని గంటల్లోనే అది విరిగిపోయింది. టెహ్రాన్‌లోని రాడార్ సైట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో దాడిని ధృవీకరించింది. అంతకుముందు, ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి ఇరాన్‌పై దాడిని ఆపమని కోరారు. నెతన్యాహు ట్రంప్‌తో మాట్లాడుతూ, 'ఇరాన్ మొదట కాల్పుల విరమణను ఉల్లంఘించినందున నేను దాడిని ఆపలేను' అని అన్నారు. ఇజ్రాయెల్ దాడుల తరువాత ట్రంప్ ఈ విషయంపై హెచ్చరికలు చేశారు. మరోసారి దాడికి దిగవద్దని ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తూ తన సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో 600 మందికి పైగా మరణాలు:
జూన్ 13న రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ దాడుల్లో 610 మంది ఇరానియన్ పౌరులు మరణించగా, 4,700 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ ప్రతీకార దాడుల్లో 28 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా, 3 వేల మందికి పైగా గాయపడ్డారు.
ముఖ్యమైన అప్డేట్స్:
- ఆపరేషన్ సింధు కింద, ఇరాన్ నుండి 2576 మంది భారతీయులను -ఇజ్రాయెల్ నుండి 594 మందిని తిరిగి తీసుకువచ్చారు.
- కాల్పుల విరమణ తర్వాత, ఎయిర్ ఇండియా మధ్యప్రాచ్యంలో విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. జూన్ 25 నుండి చాలా విమానాలు తిరిగి ప్రారంభమవుతాయి.
- అమెరికా సైనిక స్థావరంపై దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పజ్కియాన్ ఖతార్‌కు క్షమాపణలు చెప్పారు.
- ఇజ్రాయెల్ -అమెరికా తమ ఇష్టాన్ని బలవంతంగా రుద్దలేవని అధ్యక్షుడు పజ్కియాన్ అన్నారు.