పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరల పెంపును ఆమోదించింది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ఊపిరి పీల్చుకునే అవకాశమొచ్చింది. విడుదలైన మొదటి పదిహేను రోజుల పాటు, ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పెరిగిన టికెట్ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
-
సింగిల్ స్క్రీన్ థియేటర్లులో సాధారణ టికెట్ ధరను ₹100 నుండి ₹150కి పెంచుకోవచ్చు.
-
మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరను ₹200 వరకు పెంచేందుకు అనుమతించబడింది.
-
ప్రత్యేక ఆకర్షణగా జూలై 23 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోని ప్రదర్శించేందుకు అనుమతి లభించింది.
-
ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను ₹600గా నిర్ణయించారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం భారీగా ప్లాన్ చేసిన ఈ ప్రీమియర్ షోలకు ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ పెరిగిన రేట్లతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వినూత్న కథ, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్, మ్యూజిక్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌కి ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. టికెట్ ధరలు పెరిగినా అభిమానుల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.
ఈ సినిమా విజయం పవన్ రాజకీయ ప్రస్థానానికి కూడా మద్దతు కలిగించే అవకాశం ఉందంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.