ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచు ఫ్యామిలీ తీసుకువస్తున్న మూవీ కన్నప్ప. ఈ మూవీ విడుదలకు రెడీ అయిపొయింది. సరిగ్గా రిలీజ్ కు రెండురోజుల ముందు మంచు విష్ణుకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. హీరో మంచు విష్ణుతో పటు సినిమాకు చెందిన పలువురు ఇళ్లపై జీఎస్టీ అధికారులు ఒకేసారి తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు మాదాపూర్ లోని విష్ణు ఆఫీసులో జీఎస్టీ తనిఖీలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు మూవీ బడ్జెట్ పై చేసిన కామెంట్స్ జీఎస్టీ అధికారులను ఆకర్షించినట్టుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ వివరాలపై అధికారులు ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. సుమారు 120 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకూ కన్నప్ప సినిమాకు ఖర్చు పెట్టినట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాకుండా, స్వయంగా మంచు విష్ణు కూడా సినిమా కోసం చాలా ఖర్చు పెట్టేశామంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ అధికారులు దాడులు చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
మంచు విష్ణుతో పాటు మూవీ యూనిట్ సభ్యుల ఇళ్లలో కూడా జీఎస్టీ అధికారులు సోదాలు చేయడంపై సినీ వర్గాలు తీవ్రంగా చర్చిస్తున్నాయి. జూన్ 27న కన్నప్ప విడుదల కానున్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలు పెంచేసిన ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణం నటించారు. దీంతో వారి రెమ్యునరేషన్ల గురించి కూడా నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ దాడులు 'కన్నప్ప' సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాలి.