పార్టీకి, విజయనగరం జడ్పీ చైర్మన్ పదవికి
బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా
కుమార్తెతో కలిసి అమరావతిలో సీఎంతో భేటీ
టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
ఇంటిపోరు రచ్చకెక్కి పార్టీ మార్పు..
బొత్స కుమార్తెను జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో మనస్తాపం?
అమరావతి : ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా కూడా ఉన్న ఆయన.. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి, పార్టీ వదవులకూ రాజీనామా చేయడమే గాక.. వెంటనే అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన కుమార్తెతో పాటు టీడీపీలో చేరడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. 26 ఏళ్ల రాజకీయ చరిత్రలో చిన్న శ్రీసు తన మేనమామ బొత్స వద్దే శివ్యనికం చేశారు. ఆయన తర్వాత తానే మంత్రి అన్న తీరుగా వ్యవహరించారు. బొత్స కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చిన్నశ్రీనును అందరూ షాదో నేతగా భావించేవారు. పార్టీలో ఎటువంటి పదవీ లేకున్నా అధికార కేంద్రంగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో బొత్స కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంది. 2018లో జగన్ ఆహ్వానంతో వైసీపీలో చేరింది. జగన్ పాదయాత్రలో చిన్నక్రీను ఉ త్తరాంధ్రలో అన్నీతానై వ్యవహరించారు. 2021 జడ్పీ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో ఆయన చైర్మన్ నియమితులయ్యారు. చిన్న శ్రీను చేపట్టిన తొలి అధికారిక పదవి ఇదే. ఈ నెల 24తో పదవీకాలం మ-ఎగియనుంది. బుధవారం జడ్పీ సమావేశం ఉందనగా ఆయన రాజీనామా చేయడం విశేషం. బొత్సతో విభేదించి ఆయనీ నిర్ణయం తీసుకున్నారా.. లేకుంటే ఆయన కంటే ముందే వైసీపీ నుంచి బయటకు రావాలని భావించారా అనేది తెలియరాలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా బొత్స కుటుంబం మొత్తం వైసీపీకి గుడిజై చెబుతుందన్న ప్రచారం నడుస్తోంది. ఆయన దీనిని ఖండించకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంతలోనే చిన్నశ్రీను టీడీపీలో చేరి ట్విస్టు ఇచ్చారు.
కుమార్తె కోసమే నిర్ణయం?
ఇంకోవైపు.. వైసీపీకి చిన్న శ్రీను గుడ్డి బై చెప్పడానికి తగిన కారణమే ఉందని రాజకీయ వర్గాలు అంటున్నా యి. ఇటీవల బొత్స తన కుమార్తె అనూష విజయనగరం జడ్పీ చైర్పర్సన్ రేసులో ఉంటారని ప్రకటించారు. అంు-ఎతే అప్పటికే ఈ పదవికి తన కుమార్తె సిరిసహస్రను నిలబెట్టాలని నిర్ణయించుకున్న చిన్నశ్రీను.. తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా బొత్స ప్రకటించే సరికి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. అందుకే రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బలంగా ఉన్న బొత్స కుటుంబంలో చీలిక వచ్చిందన్న ప్రచారం జిల్లాలో కొంత బలంగానే ఉంది. నెల్లిమర్ల నియోజకవ ర్గంలో 2019లో బడ్డుకొండ అప్పలనాయుడు గెలిచారు. ఈయన చిన్నశ్రీనుకు స్వయానా సోదరి భర్త. కానీ నియోజకవర్గంలో బొత్స మరో సోదరుడు లక్ష్మణరావు జోక్యం చేసుకునేవారు. 2024 ఎన్నికలకు ముందు ఇక్కడ వైసీపీ టికెట్ విషయంలో పంచాయితీ నడిచింది. లక్ష్మణరావు కోసం బొత్స ప్రయత్నించినప్పటికీ అప్పలనా యుడికే మళ్లీ దక్కింది. దీంతో లక్ష్మణరావు పరోక్షంగా అప్పలనాయుడి ఓటమికి కృషిచేశారనే ప్రచారం జరిగింది.