విశాఖపట్నం, : మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అభ్యర్థులను ప్రకటించినట్లు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలోని 2వ వార్డుకు అక్కరమాని రాము నాయుడు, 3వ వార్డుకు అక్కరమాని రోహిణి, 5వ వార్డుకు దేవులపల్లి లక్ష్మి, 9వ వార్డుకు పోతిన లక్ష్మి పరమేశ్వరి, 10వ వార్డుకు పోతిన ప్రమీలను ఎంపిక చేశారు. విశాఖ తూర్పు ప్రాంతంలో 12వ వార్డుకు ఉ మ్మది స్వాతి దాస్, 19వ వార్డుకు మెల్లి లక్ష్మి, 26వ వార్డుకు పీతల గోవింద్, 28వ వార్డుకు కోన శ్రావణి, 29వ వార్డుకు పళ్ళ దుర్గారావు, 30వ వార్డుకు సూరకాల వేణుగోపాల్, 31వ వార్డుకు పీతల శ్రీను, 32వ వార్డుకు దనంతుల సీత, 33వ వార్డుకు చెన్నా ఐ శైలజ, 34వ వార్డుకు మహమ్మద్ షకీల్, 35వ వార్డుకు పెద్దగాడ బార్జి, 36వ వార్డుకు ననవల రోహిణి, 37వ వార్డుకు ఆలుపన లక్ష్మి భవాని, 38వ వార్డుకు కడవల నాగమణి, 41వ వార్డుకు వానుపల్లి భారతి, 42వ వార్డుకు కోడి గుడ్ల పూర్ణిమ, 43వ వార్డుకు పిన్నింటి రేణుక, 46వ వార్డుకు నున్నల లావణ్య, 49వ వార్డుకు బొడ్డేటి మాధవి కిరణ్ లను ప్రకటించారు. ఉత్తర ప్రాంతంలో 50వ వార్డుకు మువ్వల సంతోష్ కుమార్, 52వ వార్డుకు సాడి పద్మారెడ్డి, 53వ వార్డుకు రాజకుమారి, 55వ వార్డుకు సేనాపతి ఈశ్వరమ్మ, 56వ వార్డుకు కటుమూరి సరళాదేవి, 57వ వార్డుకు కె.వి.ఎన్. శేషికళ, 58వ వార్డుకు బొడ్డేటి అనురాధ, 59వ వార్డుకు అల్లం వెంకట సత్యశ్రీ, 61వ వార్డుకు మట్టి దమయంతి, 62వ వార్డుకు వర్వీన్, 63వ వార్డుకు గుజ్జి శ్రీదేవి, 64వ వార్డుకు రేయ్య వెంకటరమణ, 66వ వార్డుకు షేక్ జహీరున్నిసా, పశ్చిమ ప్రాంతంలో 66వ వార్డుకు సర్వసిద్ధి సాయి లత, 68వ వార్డుకు జియ్యాని శ్రీధర్, 69వ వార్డుకు నిమి కృష్ణమూర్తి యాదవ్, 70వ వార్డుకు చెంగళ హరిత హరినాధ్, 71వ వార్డుకు అల్లా భాగ్యలక్ష్మి, 72వ వార్డుకు కంబర సత్యనారాయణ, 73వ వార్డుకు దొడ్డి కిరణ్, 75వ వార్డుకు గుండావు భార్గవి, 77వ వార్డుకు భీశెట్టి ధనలక్ష్మి, 78వ వార్డుకు పిలా మాధవి, 80వ వార్డుకు ముగ్గి సూర్యనారాయణ, 81వ వార్డుకు రేవళ్ల సత్యనారాయణ, 82వ వార్డుకు గులిగిందల లావణ్యలను అభ్యర్థులుగా ప్రకటించారు. గాజువాక ప్రాంతంలో 83వ వార్డుకు పళ్ళ సురేష్ కుమార్, 84వ వార్డుకు గుడివాడ వెంకట సాయి అనుష్, 85వ వార్డుకు వరవాడ భవాని, 86వ వార్డుకు బోగాది సన్యాసిరావు, 87వ వార్డుకు ఊరుకుటి రామచంద్రరావు, 90వ వార్డుకు మహమ్మద్ ఇమ్రాన్, 92వ వార్డుకు గొండేసి శ్రీదేవి, 93వ వార్డుకు గొండేసి పద్మ శ్రీనివాస్ రెడ్డి, 94వ వార్డుకు ధర్మాల రాధిక, 96వ వార్డుకు మంత్రి శంకర్ నారాయణరావు, 98వ వార్డుకు భూవతిరాజు సుజాత, 99వ వార్డుకు కోమటి శ్రీనివాస్ రావు, 101వ వార్డుకు బొడ్డ నన్యాసిరావు, 102వ వార్డుకు బోర సోము నాయుడును ఎంపిక చేశారు. పెందుర్తి ప్రాంతంలోని 104వ వార్డుకు మద్ది శ్రీనివాసరావు, 113వ వార్డుకు గండిరెడ్డి కనక మహాలక్ష్మి నాయుడు, 117వ వార్డుకు పీతల విష్ణుమూర్తి, 118వ వార్డుకు తామరాల వెంకట లక్ష్మిని ప్రకటించారు. అనకాపల్లి ప్రాంతంలో 107వ వార్డుకు పన్నీరు వెంకట లక్ష్మి, 108వ వార్డుకు బొడ్డేటి సరోజని, 109వ వార్డుకు కర్రి లలిత, 110వ వార్డుకు ఉగ్గిన జోన్న పద్మజ, 111వ వార్డుకు దళాయి నదియా, 112వ వార్డుకు జాజుల ప్రసన్నలను అభ్యర్థులుగా బరారు చేశారు. బీసీ, ఎస్సీ, ఇతర సామాజిక వర్గాలతో పాటు మహిళలకు కూడా జాబితాలో ప్రాధాన్యం కల్పించారు.