భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీని 2017 ఐపీఎల్ సీజన్‌కు ముందు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి అకస్మాత్తుగా తొలగించినప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు. ధోనీ స్థానంలో అస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు వగ్గాలు అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచిందని, అప్పటి ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేసుకున్నాడు. క్రిక్ఇన్స్లో నిర్వహించిన 'క్రికెటర్స్ అన్ క్రికెటర్స్' షోలో డుప్లెసిస్ మాట్లాడుతూ, "2016 సీజన్ తర్వాత ధోనీని కెప్టెన్‌గా తొలగించారు. ఆ నిర్ణయంతో మేమంతా షాకయ్యాం. అంత పెద్ద టోర్నమెంట్ అది అతిపెద్ద నిర్ణయం. ధోనీ స్థానంలో స్టీవ్ స్మిత్ కొత్త కెప్టెన్ అయ్యాడు" అని తెలిపాడు. "అప్పటికి స్మిత్‌కు కెప్టెన్‌గా అంత అనుభవం లేదు. అయినా జట్టును అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్‌గా తొలగించిన ధోనీ లాంటి దిగ్గజం జట్టులో ఉ ండటం స్మిత్‌కు కఠినమైన సవాలే. అయినప్పటికీ స్మిత్ ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. అతని నాయకత్వంలో జట్టు 2017 ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. అయితే, ముంబై ఇండియన్స్ జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలయ్యాం. నిజానికి మేం గెలవాల్సిన ఫైనల్ అది. గెలిచి ఉంటే, కెప్టెన్ గా తొలి సీజన్లోనే ఐపీఎల్ టైటిల్ సాధించిన అటగాడి స్మిత్ నిలిచేవాడు" అని డుప్లెసిస్ వివరించాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వాటి స్థానంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లను తాత్కాలికంగా ప్రవేశపెట్టారు. రెండేళ్ల తర్వాత జూఖ, జట్లు తిరిగి రావడంతో పుణె, గుజరాత్ ఫ్రాంచైజీలు రద్దయ్యాయి. అ తర్వాత ధోనీ తిరిగి చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వెళ్లి 2018, 2021, 2023లో టైటిల్స్ అందించాడు. ఇక, అప్పట్లో పుణే ఫ్రాంచైజీ యజమానిగా ఉన్న సంజీవ్ గోయెంకా, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు.