నందమూరి బాలకృష్ణ, దర్శకుడు శివ నిర్వాణ కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతోందా? ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే అంశంపై అసక్తికర చర్చ జరుగుతోంది. తనదైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శివ నిర్వాణ.. బాలకృష్ణ కోసం ఓ అసక్తికరమైన కథా అలోచనను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా బాలకృష్ణను మైసూర్లో కలిసిన దర్శకుడు. ఆయనకు కథలోని ప్రధాన అంశాన్ని వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ 'దడా' సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, దర్శకుడు శివ నిర్వాణ మైసూర్లో జరుగుతున్న చిత్రీకరణకు వెళ్లినట్లు సమాచారం షూటింగ్ మధ్యలో విరామ సమయంలో బాలకృష్ణను కలిసి, తన దగ్గరున్న కథకు సంబంధించిన ఒక లైన్ ను అయనకు వినిపించినట్లు తెలుస్తోంది. అ కథా అలోచన బాలకృష్ణకు నచ్చిందని, దీంతో వీరిద్దరి కలయికలో సినిమా వచ్చే అవకాశాలపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ భేటీకి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం, శివ నిర్వాణ హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత బాలకృష్ణకు పూర్తి కథను వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కథపై ఇద్దరి మధ్య చర్చలు సానుకూలంగా సాగితే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు పూర్తి కథను వినిపించాల్సి ఉ ండటంతో పాటు, సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? నిర్మాణ సంస్థ ఏది? ఇతర నటీనటులు ఎవరు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. శివ నిర్వాణ గతంలో ప్రేమకథలు, కుటుంబ భావోద్వేగాలతో కూడిన చిత్రాలను తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు బాలకృష్ణ తనదైన నటన, శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎలాంటి కథను ఎంచుకుంటారనే ఆసక్తి సహజంగానే నెలకొంది. అయితే, బాలకృష్ణకు శివ నిర్వాణ కథ వినిపించారనే ప్రచారంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి వీరిద్దరి కలయికలో సినిమా ఖరారైందని చెప్పడానికి ఇంకా సమయం ఉంది. పూర్తి కథనం తర్వాతే ఈ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.