సినిమా ఇండస్ట్రీలో ఒకట్రెండు ప్లాపులు పడితేనే హీరోయిన్ల కెరీర్ ముగిసిపోయే రోజులివి. కానీ నిధి అగర్వాల్ కథ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ పడకపోయినా, ఆమె డైరీలో ఉన్న ప్రాజెక్టుల లిస్ట్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. భారీ చిత్రాలు చేతిలో ఉన్నప్పుడు మార్కెట్ ఊపందుకోవడం సహజం, కానీ బాక్సాఫీస్ దగ్గర ఫలితాలు తేడా కొట్టినా నిధి డిమాండ్ తగ్గకపోవడం టాలీవుడ్ లో ఒక సరికొత్త మిస్టరీలా మారింది. నిజానికి పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు', ప్రభాస్ 'ది రాజా సాబ్' లాంటి భారీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ దక్కడం ఏ హీరోయిన్ కైనా గోల్డెన్ ఆఫర్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఏళ్ల తరబడి సాగిన ఈ భారీ ప్రాజెక్టుల షూటింగులు ఆమె కెరీర్ ప్రైమ్ టైమ్ ను తినేశాయి తప్ప ఆమె ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లలేకపోయాయి. పైగా 'హరిహర వీరమల్లు' పూర్తయ్యే వరకు ఇతర సినిమాలు ఒప్పుకోకూడదనే కాంట్రాక్ట్ కూడా ఉండేది. 'ది రాజా సాబ్'ను సైతం నిర్మాతల అనుమతితోనే అంగీకరించారు. ఒకవైపు అనూహ్యమైన తాప్యం, మరోవైపు రిలీజైనవి ఆశించిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఎవరైనా అయితే సైలెంట్ అయిపోయేవారు. కానీ నిధి మాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త వ్యూహాలతో ముందుకెళ్తంది. ఇక్కడే నిధి తన కెరీర్ ప్లానింగ్ ను చాలా తెలివిగా మార్చుకుంది. కేవలం టాలీవుడ్ పైనే పూర్తిగా ఆధారపడకుండా ఒకేసారి మూడు ఇండస్ట్రీలపై కన్నేసింది. బాలీవుడ్ లో ఏకంగా మూడు ప్రాజెక్టులు, కోలీవుడ్ లో మరో చిత్రం చేస్తూ నార్త్, సౌత్ రెండింటినీ కవర్ చేస్తోంది.