ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేను ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివా రం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 లో నిలిచి చివరి ప్లేఆఫ్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, రాజస్థాన్ అద్భుత ప్రదర్శనతో ఆ రెండు జట్లను రేసు నుండి పూర్తిగా తప్పించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో కలిసి రాజస్థాన్ రాయల్స్ నాకౌట్ దశకు చేరుకోవడంతో ఈ సీజన్ లీగ్ మ్యాచ్‌ల ఉత్కంఠ ముగిసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ కేవలం 15 బంతుల్లోనే 32 పరుగులు బాదడమే కాకుండా, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు వడగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 205 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 175 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్ నూర్యకుమార్ యాదవ్ 60 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. మే 26 తేదీన ధర్మశాల వేదికగా వేదికగా జరిగే క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తలవడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత మే 27 తేదీన ముల్లాన్‌పూర్‌లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో మూడో స్థానంలో ఉన్న నన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫైయర్-1 లో ఓడిన జట్టుతో మే 29 తేదీన ముల్లాన్‌పూర్‌లోనే క్వాలిఫైయర్ -2 మ్యాచ్ ఆడుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టు మే 31 తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్లో టైటిల్ కోసం పోరాడుతుంది. నిజానికి ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో జరగాల్సి ఉన్నప్పటికీ, కొన్ని స్థానిక భద్రతా కారణాల వల్ల బీసీసీఐ ఈ వేదికను అహ్మదాబాద్‌కు మారుస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది.