పంట నష్టపోయిన వారికి హామీ
కలెక్టర్లతో సమీక్షించిన సీఎం చంద్రబాబు
అమరావతి : అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ సీఎం సమీక్షించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిళ్లిందని అధికారులు వివరించారు. వీటి విలువ రూ.40 కోట్లుగా అధికారులు తేల్చారు. 9 జిల్లాల్లో 48. మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశారు. సీఎం చంద్రబాబుకు సబ్కా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఉగాది కానుకగా తాము సైతం ఊహించని విధంగా సూక్ష్మ, చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న 2021 వివిధ మున్సిపాలిటీలలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై సబ్కా మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని అన్నారు. అలాగే రోడ్ల పనులు చేసిన వారికి, డీఎంఎఫ్, ఎస్టీఎంఎఫ్, వివిధ రాష్ట్రాల్లో పనులు చేసిన వారికి బిల్లులు విడుదల చేశారని తెలిపారు. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సవాళ్లలో సైతం ఉ గాది పండుగ సందర్భంగా నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా బిల్లులు రాని కాంట్రాక్టర్లకు సైతం ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
వాతావరణ పరిస్థితులపై రైతులను అప్రమత్తం చేయాలి
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ, అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తద్వారా పంట నష్టం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, పంట నష్టం జరిగినప్పుడు పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వాసలతో పంటలకు జరిగిన నష్టంపై గురువారం సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, మన్యం జిల్లాల్లోని 16 మండలాల్లో 89 గ్రామాల్లో వర్షాలతో వంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అధికారులు సీఎంకు వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మొత్తం 1,215 హెక్టార్లలో సాధారణ వంటలు దెబ్బతినగా, 2,048 మంది రైతులు నష్టపోయినట్లు చెప్పారు. అలాగే అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు తెలిపారు.