టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
మరో రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. అయితే..ఈ మెగా టోర్నీలో భారత్తో మ్యాచ్ను ఆడబోమని పాక్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. పాక్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా భారత్, పాక్ మ్యాచ్ పై అనిశ్చితి ఏర్పడింది. తాజాగా భారత్తో మ్యాచ్ ఆడమని పాక్ ప్రభుత్వ ప్రకటనపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి స్పందించాడు. పాకిస్తాన్తో మ్యాచ్ ఆడమని తాము ఎన్నడూ చెప్పలేదన్నాడు. ఆ జట్టుతో మ్యాచ్ ఆడేందుకు తాము కొలంబో వెళతామన్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్లెయిన్ టికెట్స్ కూడా బుక్ అయ్యాయని తెలిపాడు. సూర్యకుమార్ ఏం మాట్లాడంటే.. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మేము వారితో (పాక్) ఆడటానికి నో చెప్పలేదు, వారే నో చెప్పారు. మా విమానాలు బుక్ అయ్యాయి. మేము కొలంబోకు వెళ్తున్నాము. మేం మొదట యూఎస్ ఆ తరువాత నమీబియాతో ఆడతాం. ఆ తరువాత కొలంబో వెళతామని సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ లో భారత్తో మ్యాచ్ను ఆడమని మరోసారి పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ప్రధాన షెహబాబ్ షరీఫ్ తెలిపారు. దీనిపై బీసీసీఐ ఉ పాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంతో బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఐసీసీనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి తాము కట్టుబడి ఉంటామన్నాడు.