ప్రతి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి
వంట బీమాపై రైతులకు అవగాహన
ఎల్ నినోపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం
సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయాలపై దృష్టి
మంత్రి నిమ్మలతో డిప్యూటీ సీఎం పవన్
అమరావతి : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన సాగునీటి సంక్షోభాన్ని రైతులకు అర్థమయ్యేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచిం చారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించాలని చెప్పారు. నీటి వృథా నివారణ, పంటల బీమా, ప్రత్యామ్నాయసాగు మార్గాలపై క్షేత్రస్థాయిలో చైతన్యం పెంపొందించాలని జల వనరుల శాఖకు దిశానిర్దేశం చేశారు. సంక్షోభనివారణకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలన్నారు. జల వనరుల మంత్రి నిమ్మల శాఖ రామానాయుడుతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి పరిస్థితులపై చర్చించారు.
ఏలేరు నీటి విడుదలపై కృతజ్ఞతలు
కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతుల అవసరాల దృష్ట్యా కోరిన వెంటనే ఏలేరు ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు నిమ్మల రామానాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా, ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి పరిస్థితులను పరిశీలించనున్నట్లు వివరించారు. ప్రకృతి వివత్తుల కారణంగా నష్టాలు ఎదురుకాకుండా ప్రతి రైతు ప్రధాన మంత్రి ఫనల్ బీమా యోజన కింద వంటల బీమా చేయించుకునేలా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగాన్ని జనసేనాని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు విలువైనదని జనసేనాని పవన్ అన్నారు. కాలువల్లో పూడిక తొలగింపు, గట్ల లీకేజీల నివారణ, మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలని సూచించారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
డిప్యూటీ సీఎం సార్.. ఆరోగ్యం జాగ్రత్త: నిమ్మల
భుజం శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను నిమ్మల రామానాయుడు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఎదురవుతున్న సాగునీటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే రైతుల్లో అవగాహన, నీటి సంరక్షణ, పంటల బీమాపై చైతన్యం, క్షేత్రస్థాయి సమన్వయం కీలకమని ఈ సమావేశం ద్వారా కూటమి నేరుల స్పష్టం చేశారు.