విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'రణబాలి', తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 1854-1878ల నాటి బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో, రాయలసీమ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ పవర్ ఫుల్ యోధుడిగా కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. వారు ఆ కథను పాతిపెట్టారు.. వారు ఆ పేరును చెరిపివేశారు. వారు తమ పాపాలను తుడిచిపెట్టారు. కానీ అతని రౌద్రాగ్నిని మాత్రం ఎప్పటికీ పాతిపెట్టలేకపోయారు. జానపద గాథలు, చరిత్ర అతన్ని ఎప్పటికీ మరువవు. రణబాలి.. ఆ యోధుడి ప్రతిజ్ఞ" అని మేకర్స్ పేర్కొన్నారు. "అతిథులుగా వచ్చి, అణచివేతదారులుగా మిగిలిపోయిన వారిని, రక్తం చిందించాలని నిర్ణయించుకున్న మన గ్రామాల్లోని ఆ మనుషులను.. ఎప్పటికీ మర్చిపోవద్దు" అని విజయ్ దేవరకొండ పోస్ట్ పెట్టారు. 1854 - 1878 మధ్య కాలంలో బ్రిటిష్ ఇండియాలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా 'రణబాలి' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో రణబాలి అనే వీరుడిగా విజయ్ దేవరకొండ కనిపిస్తుండగా.. ఆయన భార్య జయమ్మ పాత్రను రష్మిక పోషించారు. అజయ్ – అతుల్ సంగీతం సమకూర్చగా.. నీరవ్ షా, జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 'రణబాలి' చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని ఐ వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్- రష్మిక కలిసి నటిస్తున్న సినిమా ఇది. భార్యాభర్తలుగా మారిన తర్వాత విరోష్ నుం చి రాబోయే తొలి సినిమా కావడంతో అభిమానులు ఎగ్జిటెడ్ ఉన్నారు.