తొలిసారి హజారే ట్రోఫీ కైవసం
ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి
బెంగళూరు: గత ఏడాది రంజీ చాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టు ఈసారి విజయ్ హజారే వన్డే టోర్నీని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగులతో సౌరాష్ట్రను ఓడించి తొలిసారి హజారే ట్రోఫీ విజేతగా నిలిచింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 317/8 స్కోరు సాధించింది. ఓపెనర్ అథర్వ టైడే (128) శతకంతో దుమ్ము రేపాడు. యశ్ రాథోడ్ (54) అర్థ శతకంతో సత్తా చాటాడు. భారీ ఛేదనలో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 రన్స్‌కు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (88), చిరాగ్ జానీ (64) రాణించారు. విజేతగా నిలిచిన విదర్భకు ఐపీఎల్ పాల కమండలి సభ్యుడు చాముండేశ్వర్ నాథ్ ట్రోఫీ అందజేశాడు.
సంక్షిప్త స్కోర్లు
2: 50 ລ້ 317/8 (໑໕ 128, 54/65).
సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 అలౌట్ (ప్రేరక్ 88, చిరాగ్ 64, యశ్ ఠాకూర్ 4/50, ລ້ 3/46, ໕໓ ລ້ 2/52)