ప్రయాణికులకు రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక
ప్రధాని మోదీ చేతుల మీదుగా రైలు ప్రారంభం
రాబోయే 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు తీపికబురు చెప్పింది. ఈ మేరకు త్వరలోనే వందేభారత్ స్లీపర్ ట్రైన్ల కు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ప్రకటించారు. అయితే, ఫస్ట్ ట్రైన్ కోల్‌కతా- గౌహతిల మధ్య నడవనుందని పీఎం మోడీ చేతుల మీదుగా ఆ ట్రైన్ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్- అస్సాం మధ్య నడిచే ఈ వందేభారత్ లో ఫ్లైట్ టికెట్ ధరల కంటే తక్కువే ఉంటాయని తెలిపారు. రాబోయే 20 రోజుల్లో ఈ రైలు అందుబాటులోకి రానుందని జనవరి 18 నుంచి 19 తేదీల్లో వందేభారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభిస్తామని అన్నారు. రైలు ప్రారంభోత్సవం గురించి ప్రధాని మోదీకి తెలియజేశామని చెప్పారు. రాబోయే 2-3 రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం కోల్‌కతా, గౌహతి నగరాల మధ్య విమాన ప్రయాణానికి రూ.6 వేలు నుంచి 8 వేలు ఖర్చవుతోందని అదే వందేభారత్ స్లీపర్ లో 3 టైర్ ఏసీలో ఫుడ్‌తో కలిపి ఒక ప్రయాణికుడికి రూ.2,300, 2 టైర్ ఏసీ రూ.3 వేలు, 1 టైర్ ఏసీలో రూ.3,600 ఛార్జీలు ఉండొచ్చని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.