టీమ్ ఇండియా అండర్-19 ప్రపంచ కప్ 2026 టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. గత ఏడాది నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు ఈ టీనేజ్ సంచలనం. ఇటీవల వైభవ్ సూర్యవంశీ 10వ తరగతి పరీక్ష రాయబోతున్నాడని వార్త వచ్చింది. తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ పరీక్షలకు హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని క్రికెటర్ వైభవ్ తండ్రి స్వయంగా తెలిపారు. తాజ్పూర్ లోని మోడెస్టీ పాఠశాల ప్రిన్సిపాల్ ఆదర్శ్ కుమార్ అలియాస్ పింటూ మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ తండ్రితో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బిజీ షెడ్యూల్ కారణంగా వైభవ్ పరీక్షలు రాయలేకపోతున్నాడని, అయితే అతని ప్రిపరేషన్స్, ఎగ్జాట్ సెంటర్ సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని ఆయన అన్నారు. మొదట తాను పరీక్షలకు హాజరు కావాలని బీసీసీఐని పర్మిషన్ అడిగాడని వార్తలు వచ్చాయి. కానీ అండర్ 19 టీం బిజీ షెడ్యూల్స్, మ్యాచ్లకు అందుబాటులో ఉ ండేందుకు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయడం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఎగ్జామ్ సెంటర్ పోడ్డార్ ఇంటర్నేషనల్ స్కూల్, సమస్తిపూర్ లో ఉ ంది. స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వైభవ్ అడ్మిట్ కార్డు వచ్చిందని, అన్ని అవసరమైన డాక్యుమెంట్లు స్కూల్ యాజమాన్యం వద్ద భద్రంగా ఉ ంచామని చెప్పారు. వైభవ్ సాధారణ విద్యార్ధిలాగే పరీక్షకు వస్తాడని, అతని కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.