1127కి చేరిన వరద మృతుల సంఖ్య
4858 మంది కోసం ఇంకా గాలింపు డీఎన్ఏ టెస్టుల ద్వారా శవాల గుర్తింపు
ప్రళయంల విరుచుకుపడిన వరదలతో నేపాల్‌లో మరణమృదంగం కొనసాగుతోంది. ఊహించని విధంగా సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడి ప్రజలు వేల సంఖ్యలో ప్రాణాలు వదిలారు. తాజా లెక్కల ప్రకారం వరద మృతుల సంఖ్య 1127కి చేరిందని అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ ఆచూకి దొరకని వారి సంఖ్య కూడా సుమారు 5 వేల మందిపైగా ఉంటుందని అంచనా వేశారు. నేపాల్ వరదల్లో ఒక్క చిత్వాన్ జిల్లాలోనే అత్యధికంగా అంటే 348 మంది మృతదేహాలను వెలికితీశారు సహాయక బృందాలు, వారితో పాటు మరో 6541మందిని ప్రాణాలతో కాపాడి సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. రెస్క్యూ టీమ్స్, నేపాల్‌లో వరదలతో ఏర్పడిన విధ్వంసానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొదట వరకు వెయ్యి మంది గల్లంతైనట్లు భావించిన అధికారులు ..ఇప్పుడు వరదల్లో చిక్కుకొని, గల్లంతైన వారిలో చనిపోయిన వారి సంఖ్యే 12 వందలకు చేరుకుంటోంది. 1127 మంది చనిపోయినట్లుగా నేపాల్ పోలీస్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇక వరదల్లో గల్లంతై, బురదల్లో చిక్కుకుపోయిన వాళ్ల సంఖ్య కూడా 4858 మంది వరకు ఉన్నారని అక్కడి జనాభా లెక్కల ప్రకారం తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చిత్వాన్ జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో మృతదేహాలను వెలికి తీశారు. గత వారంరోజులకుపైగా కొనసాగుతున్న సహాయకచర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 848 మృతదేహాలను వెలికితీశారు. సవల్వరాసి ఈస్ట్‌లో 217, సవల్వరాసి వెస్ట్‌లో 190, సువాకోట్లో 155 మంది ప్రాణాలు కోల్పోయారు. ధాడింగ్, గోర్ఖా, రసువా, తనాహుల జిల్లాల్లో కూడా చనిపోయిన వారి సంఖ్యలో వందల్లోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక నేపాల్ పరదల్లో చిక్కుకున్న వారు, గల్లంతైన వారితో పాటు తీవ్రంగా గాయాలపాలైన వాళ్ల కోసం కోసం రెస్క్యూ బృందాలు విస్తృతంగా శ్రమిస్తున్నాయి. 7,912 మంది పోలీసు సిబ్బంది వరదలు సంభవించిన 4 జిల్లాల్లో 6,541 మందిని రెస్క్యూ టీమ్‌లు సురక్షితంగా రక్షించాయి. ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాల్లో కేవలం 95 మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులు గుర్తించి తీసుకెళ్లారని నేపాల్ ప్రధాని బాలెన్ షా తెలిపారు. గుర్తు పట్టలేని విధంగా ఉన్న శవాలకు డీఎన్ఏ నమూనాలు సేకరించి భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు. నేపాల్‌లో సంభవించిన వరదలు ఆకస్మిక వరదలు మాత్రమే కాదని రాకాసి వరదలుగా చూస్తున్నారు అక్కడి ప్రజలు.