స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు సాధించాలి
క్వాంటమ్ కంప్యూటర్లు ఎగుమతి చేసే స్థాయికి ఏపీ జిల్లాస్థాయిలో కలెక్టర్లు, మంత్రులు సమన్వయంతో సాగాలి
వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు... అధికారులదే బాధ్యత అని హెచ్చరిక
క్షేత్రస్థాయిలో పర్యటించి పాలన అమలును పరిశీలించాలని మంత్రులకు సూచన
గత ప్రభుత్వ అప్పుల వల్ల అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని వెల్లడి
అధికారులు, కార్యదర్శులు, మంత్రులతో సీఎం చంద్రబాబు
ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా పాల్గొన్నారు. జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో 36 భాగంగా సాంకేతికతతో పాటు అవేర్, డేటా లీక్, పాలనలో ఏఐ టూల్స్ వినియోగం, కేంద్ర ప్రాయోజిత పథకాల యాక్షన్ ప్లాన్, యువతకు నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అమలుపై చర్చించారు. విశాఖలో గూగుల్ తో పాటు ఇతర సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి.. మొత్తం 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు రాబోతున్నాయి.. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీకి కూడా కార్యాచరణ మొదలైంది ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశర చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ల సదస్సులు నిర్వహించేవారు కాదు.. ఇప్పుడు మూడునెలల కోసారి నిర్వహిస్తున్నాం. ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ భేటీ జరుగుతోంది. నెలవారీగా అధికారులు సమీక్ష చేసుకోవాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు సమర్థంగా పనిచేయాలి. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్తుంది. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్‌కు శంకుస్థాపన చేశాం. రెండేళ్లలో ఇక్కడి నుంచి క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయి. మనమే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు బ్రవరి, 20 అందిస్తాం. ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెనుమార్పులు వస్తాయని సీఎం అన్నారు. వివిధ శాఖల వారీగా పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. సమావేశంలో స్త్రీ శక్తి పథకం విజయవంతమైన అమలుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ పనితీరుపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ ప్రశంసలపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి మండివల్లి.. తమకు బాధ్యత మరింత పెరిగిందన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 4 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణ సేవలను ఏపీఎస్ఆర్టీసీ విజయవంతంగా అందించిందని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్త్రీ శక్తి వథకాన్ని కేవలం బరువుగా కాకుండా బాధ్యతగా స్వీకరించి సేవలు అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవలను మహిళలకు అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఉన్న హెలిప్యాడ్ భూమిపై ఆరా తీశారు. జగన్ ఇంటి పక్కన ఉన్న హెలిప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారు.. ప్రైవేట్ వ్యక్తికి దగ్గర కొనుక్కున్న భూమిని హెలిప్యాడ్ కోసం ఇవ్వనంటే.. బెదిరించారు.. అయినా ఇవ్వకపోతే.. 22-ఎలో పెట్టారు.. ప్రైవేట్ ల్యాండ్ ను దుర్మార్గంగా లాక్కున్నారు.. చట్టాలు చేయాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి భూమిని ఇల్లీగల్ గా 22-ఎలో పెట్టాడు.. ఇది పరాకాష్ట కాదా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు అవుతున్న అతనికి విముక్తి కలగలేదని తెలిపారు. మొన్న కలిసి అన్ని వివరాలు ఇచ్చారు.. భూములపై అప్పటి పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు అనే దానిపై అందరూ ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, రెవెన్యూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నాం.. భూ వివాదాలు లేకుండా.. పకడ్బందీగా సర్వే పక్రియ చేపడుతున్నాం.. క్యూఆర్ కోడ్ సహా ఇతర భద్రతా ఫీచర్లతో పాస్ పుస్తకాలను అందజేస్తున్నాం.. తే సాగునీటి కోసం ఇప్పటి వరకూ రూ. 24 వేల కోట్లు ఖర్చు చేశాం.. అని చంద్రబాబు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో కీలక సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. సీఎస్ కె. విజయానంద్ స్వాగతోపన్యాసం చేశారు.