కొత్త యూట్యూబర్లకు కష్టకాలం వచ్చింది. మానిటైజేషను అవసరమైన వాచిమ్ను ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ రెట్టింపు చేసింది. క్రియేటర్లు వీడియోల ద్వారా డబ్బు సంపాదించడానికి వీలు కల్పించే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో చేపట్టిన మార్పుల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు యూట్యూబ్ బ్లాగ్ పోస్ట్ వెల్లడించింది. ఇంతకు ముందు.. డబ్బు సంపాదించాలంటే కంటెంట్ క్రియేటర్లు గత 365 రోజుల్లో 4,000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. అయితే.. కొత్త నిబంధనల ప్రకారం గత 365 రోజుల్లో 8,000 క్వాల్లి-డ్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వీక్షణలు ఉండాలి. 1,000 మంది సబ్సైబర్లు ఉండాలనే నియమంలో మాత్రం ఎటువంటి మార్పు లేదని తెలిపింది. అయితే ఇప్పటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఉన్న క్రియేటర్లపై ఈ ప్రభావం ఉ ండబోదని పేర్కొంది. ప్రోగ్రామ్‌లో ఇప్పటికే 3 మిలియన్లకు పైగా కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. ఈ నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. యూట్యూబ్ షార్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం కోసం కూడా ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. షార్ట్స్్ప వచ్చే ప్రకటనలు, సబ్ స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకోవడానికి అర్హత పొందాలంటే క్రియేటర్లు 90రోజుల వ్యవధిలో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ కలిగి ఉండాలి. ఈ నిబంధన కొత్త క్రియోటర్లతో పాటు ఇప్పటికే ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. యూట్యూబ్ ప్రీమియం అందుబాటులో ఉన్న అన్ని దేశాలకు ఈ ప్లాట్‌ఫామ్ ప్రీమియం లైట్ సేవలను విస్తరించింది. ఈ నబ్స్క్రిప్షన్ ద్వారా అందులోని కంటెంట్‌ను నిరంతరాయంగా చూడొచ్చు. ప్రీమియం లైట్ సేవలు భారత్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. దీని ధర నెలకు రూ.89 కాగా, స్టాండర్డ్ ప్లాన్ ధర రూ.149. దీనివల్ల క్రియేటర్లు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని పేర్కొంది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్‌లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ఎ+-లాట్ఫామ్లో క్రియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మానిటైజేషన్ నిబంధనలను కంపెనీ మరింత కఠినతరం చేసింది. షార్ట్స్, ప్రకటనలు, ప్రీమియం ఆదాయ భాగస్వామ్యానికి సంబంధించిన నిబంధనలను సవరించింది. యూట్యూబ్ షాపింగ్‌లో నిర్దిష్ట మైలురాళ్లు చేరిన వారికి బోనస్‌లు, బ్రాండ్ డీల్స్‌కు ప్రోత్సాహకాలు, ట్రెండింగ్ కంటెంట్ ప్రారంభించి అభివృద్ధి చేసే వారికి అదనపు ఆదాయ అవకాశాలు కల్పించనుంది. యూట్యూబ్ ప్రీమియం లైట్‌ను అందుబాటులో ఉన్న అన్ని దేశాలకు విస్తరించనున్నారు. ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ద్వారా వచ్చే నికర ఆదాయంలో 30 శాతం, ప్రీమియం లైట్ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం క్రియేటర్ల కోసం కేటాయిస్తారు. సభ్యులు చూసే సమయం, వీడియోల వ్యూస్ ఆధారంగా ఈ మొత్తాన్ని క్రియేటర్లకు పంపిణీ చేస్తారు. లాంగ్ ఫార్మ్ వీడియోలకు 55 శాతం, షార్ట్క 45 శాతం రెవెన్యూ షేర్ లభిస్తుంది. అయితే యూట్యూబ్‌లో కొత్తగా మానిటైజేషన్ పొందాలనుకునే వారికి ఈ నిబంధనలు కాస్త నవాలుతో కూడుకున్నవే. ఇప్పటి వరకు ఉన్నదాని కంటే రెట్టింపు వాచ్ఎమ్ సాధించడం అంత సులభమైన పని కాదు. కాబట్టి కేవలం వైరల్ కంటెంట్‌పై ఆధారపడకుండా ఒరిజినల్ కంటెంట్‌ను ఇస్తూ వ్యూస్ సాధించగలిగితే క్రియేటర్లకు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంటుంది.