న్యూజిలాండ్ జరుగుతున్న సిరీస్‌లో చివరి రెండు టీ20లకు అతడు అందుబాటులో ఉండదని బీసీసీఐ సోమవారం ధృవీకరించింది. జనవరి 7న రాజ్‌కోట్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న 23 ఏళ్ల తిలక్ వర్మ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పడుతుంది. తిలక్ వర్మ ఇటీవల జనవరి 7న రాజ్‌కోట్‌లో పొత్తికడుపు సమస్యతో చిన్న సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. తిలక్ ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం అతడు కొన్ని రోజులు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. టీ20 వరల్డ్ కప్ కోసం అతడు మరింత ఫిట్, ఆరోగ్యంగా ఉండాలని భావించిన బీసీసీఐ మేనేజ్మెంట్, కోచ్ తిలక్ వర్మకు విశ్రాంతినిచ్చారు. ఫిబ్రవరిలో జరగనున్న ప్రపంచ కప్ కోసం ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ చివరి రెండు మ్యాచ్‌లకు సైతం అతడు అందుబాటులో ఉండడని తెలిపారు. భారత అభిమానులకు శుభవార్త. తిలక్ వర్మ ఫిబ్రవరి 3న ముంబైలో జాతీయ జట్టుతో కలవనున్నాడు. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే 2026 ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లకు స్టార్ బ్యాటర్ అందుబాటులో ఉంటాడని తెలుగు తేజం, టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. తెలుస్తుంది. "తిలక్ వర్మ జనవరి 7, బుధవారం నాడు రాజ్‌కోట్‌లో పొత్తికడుపు సమస్య రావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గురువారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తరువాత శు క్రవారం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లాడు. ప్రస్తుతం తిలక్ ఆరోగ్యంగా ఉన్నాడు. వేగంగా కోలుకుంటున్నాడు' అని బీసీసీఐ గతంలో ఒక అప్డేట్లో తెలిపింది. పూర్తిగా కోలుకోవడంతో పాటు ఫిట్ నెస్ ముఖ్యమని, త్వరలో అతడు జట్టుతో కలుస్తాడని బీసీసీఐ పేర్కొంది. తిలక్ దూరం కావడంతో, న్యూజిలాండ్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను కొనసాగించాలని సీనియర్ మెన్ సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. అయ్యర్ సిరీస్ లో కొనసాగనున్నాడు. జట్టు యాజమాన్యం ఇషాన్ కిషన్‌ను నెం. 3 స్థానంలో బ్యాటింగ్ చేపిస్తుంది. అయితే మొదటి మూడు మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలం కావడంతో సంజూ శాంసన్ పై ఒత్తిడి పెరిగింది. చివరి రెండు టీ20ల్లోనూ సంజూ ఇలాగే ఆడితే టీ20 వరల్డ్ కప్ లో శాంసన్ తుది జట్టులో ఉండటం కష్టమే. ఇషాన్ కిషన్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. వరల్డ్ కప్ లో తిలక్ వచ్చాక కిషన్ బెంచ్ మీదకు వెళ్లక తప్పదు. కానీ సంజూ శాంసన్ ఫామ్, ఆటతీరు చూసి మేనేజ్మెంట్ కరుణిస్తే తుది జట్టులో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలు అందించనున్నాడు.