రాష్ట్ర వ్యాప్తంగా 8,888 హెక్టర్లలో గ్రీన్ వాల్
గ్రేట్ గ్రీన్ వాల్ పనుల్లో స్పీడ్ పెంచాలి
రెండు నెలల్లో లక్ష్యాలు పూర్తి చేయాలి
తీర ప్రాంతాలకు మరో 70 లక్షల మొక్కలు
మడ అడవుల విస్తరణలో ఏపీ రెండో స్థానం
ఈ ఏడాది మరింత బాధ్యతగా కార్యక్రమాలు
అధికారులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం
వాతావరణ మార్పులు, సముద్ర తీరం కోత, ప్రకృతి వైపరీత్యాల ముప్పు నియంత్రణకు రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయా లని డిప్యూటీ సీఎం, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. 2026-27 సంవత్సరా నికి నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సోమవారం అటవీశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో డివిజ స్వారీగా మొక్కల పెంపకం, మడ అడవుల విస్తరణ, తాటి వనాల ఏర్పాటు, సామాజిక పనాల పురోగతిని సమీక్షించారు. పర్యావరణ మార్పుల ప్రభావంతో తీర ప్రాంతాలు తీవ్ర ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయని, అలాంటి పరిస్థితుల్లో 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో పచ్చదస రక్షణ కవచం ఏర్పాటు చేయడమే గ్రేట్ గ్రీస్ వాల్ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా తుఫానులు, సముద్రపు అలల ప్రభావం, తీర కోతను తగ్గించడంతో పాటు జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు. ఈ ఏడాది మొత్తం 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందులో 5,000 హెక్టార్లలో తాటి వనాలు, 1,993 హెక్టార్లలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద దేశీయ మొక్కల పెంపకం, 727 హెక్టార్లలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు, 48 హెక్టార్లలో పరిహార అటవీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వీవీజీ రామ్ పథకం కింద తీర ప్రాంత జిల్లాలకు 70 లక్షల ఆదనపు మొక్కలు అందుబాటులోకి రానున్నాయని, వాటిని 2,500 హెక్టార్లలో నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. తాటిచెట్లు తీర ప్రాంతాల్లో గాలి వేగాన్ని తగ్గించే సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయని పేర్కొన్న పవన్, ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో తాటి విత్తనాల సేకరణ, నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తీర ప్రాంతంలో మూడంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మొదటి వలయంలో మడ అడవులు, షెల్టర్ బెర్త్‌లు, రెండో, మూడోవలయాల్లో గ్రామవనాలు, సామాజిక వనాలు, వ్యవసాయ వనాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, వర్షపాతం, నేల స్వభావం ఆధారంగా మొక్కల ఎంపిక చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు అమలును ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ క్లైమేట్ ఛేంజ్ మిటిగేషన్ సొసైటీ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తు న్నామని, అన్ని శాఖల సమిష్టి కృషితో గ్రేట్ గ్రీన్ వాలు దేశంలో ఆదర్శ ప్రాజెక్టుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని డ్రా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.