టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు పాకిస్థాన్ పై మరో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. దాంతో సూపర్-8లో తన స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది.. ఎంతో ఉత్కంఠ రేపుతుందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తూ ఏకపక్షంగా సాగిన మ్యాచులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు బోర్డుపై ఉంచింది. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై భారత్ కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆరంభంలోనే షాక్ తగిలినప్పటికీ, ఆ తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తన ధనాధన్ బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇషాన్ వేగంగా పరుగులు రాబడుతూ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. స్టేడియం నలుమూలలా షాట్లు ఆడుతూ పాకిస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాడు. తన పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్్స్ను చక్కదిద్దాడు. మిడిల్ ఓవర్లలో ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ తిలక్ వర్మతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 170 దాటించడంలో కీలకపాత్ర పోషించాడు. సూర్య 29 బంతుల్లో 32 పరుగులు చేయగా.. చివర్లో ఆల్ రౌండర్ శివమ్ దూబే 158.82 స్ట్రైక్ రేట్‌తో 27 పరుగులు చేశాడు. దాంతో భారత్ ఈ పిచ్ మీద పాక్క భారీ టార్గెట్ ఇవ్వగలిగారు. 175 పరుగుల టార్గెట్ కాపాడుకునే క్రమంలో బరిలోకి దిగిన భారత జట్టుకు బౌలర్లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. హార్దిక్ పాండ్యా తన మొదటి ఓవర్లోనే పాకిస్థాన్ ఓపెనర్‌ను అవుట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. 3 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తన బౌలింగ్ లో పాక్ బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. పాక్ స్పిన్నర్లతో ఇబ్బంది పెడితే భారత్ మాత్రం పేసర్లు, స్పిన్నర్లతో పాక్ ను కట్టడి చేసింది. భారత ఫాస్ట్ బౌ లర్ జస్ప్రిత్ బుమ్రా తన స్పెల్‌లో సయీమ్ అయూబ్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా వికెట్లు తీసి పాకిస్థాన్ బ్యాటింగ్‌ను బ్యాక్పుట్లోకి నెట్టాడు. బుమ్రా బౌలింగ్ తో పాక్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ అక్షర్ పటేల్ రాణించాడు. పాకిస్థాన్ కీలక బ్యాటర్లను అవుట్ చేసి మ్యాచ్పి భారత్ పట్టు బిగించేలా చేశాడు. వీరికి తోడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ్కు దిగిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ తన గ్రూపులో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. టీ20 వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ ఆధిక్యం 8-1కి పెరిగింది. భారత్ నెక్స్ట్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 18న నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్ ఆడనుంది.
19 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..!
టీ20 వరల్డ్ కప్‌లో దాయాది దేశాల మధ్య జరిగిన హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో.. పాక్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన పాకిస్తాన్ జట్టును.. భారత్ 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, తన అజేయమైన రికార్డును కొనసాగించింది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. అయితే, అభిషేక్ డకౌట్ రూపంలో మొదటి ఓవర్లోనే ఔట్ అయ్యాడు. దీంతో పాక్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. అయితే, వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ పాకిస్తాన్ బౌలర్లపై బ్యాటుతో విర విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2007 ఫైనల్ నల్ తరువాత చేశాడు. ఐసీసీ పాకిస్తాన్ జట్టుపై హాఫ్ సెంచరీ బాదిన తొలి ఓపెనర్ ఇషాన్ కిషన్ చరిత్రకెక్కాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. పాకిస్తాన్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గత 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
గత 19 ఏళ్లలో ఏ భారత ఓపెనర్ కూడా పాక్‌పై టీ20 ప్రపంచ కప్‌లో హాఫ్ సెంచరీ సాధించలేదు. చివరి సారిగా 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ ఓపెనర్ వచ్చి పాకిస్తాన్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ భారత ఓపెనర్ హాఫ్ సెంచరీ సాధించలేదు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగినా పాకిస్తాన్ జట్టుపై 50 పరుగులు చేయలేక పోయారు. తాజాగా.. ఆ ఘనతను ఇషాన్ కిషన్ సాధించాడు.