పేదలకు 52 వేల కోట్ల ఆస్తి
60 వేల మందికి పట్టాల క్రమబద్ధీకరణ
ఇక మీకంటూ సొంత ఇల్లు.. అమ్ముకోవద్దు..
సెక్యూరిటీగా ఉంచి పరిశ్రమలు పెట్టుకోండి
అమరావతిని అడ్డుకుంటే అంతే గోదావరి పుష్కరాలకు
పుష్కలంగా నీరు రానున్న రోజుల్లో కరువు కనిపించదు
కృష్ణా డెల్టా, సీమను సస్యశ్యామలం చేస్తాం
బెజవాడ-గుంటూరు-అమరావతి అన్జపబుల్ పేదల పట్టాభిషేకంలో సీఎం వ్యాఖ్యలు
విజయవాడ, : ఎవరికి ఇష్టం ఉన్నా, లేకపోయినా అమరావతిని అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే అమరావతే వారి అంతు చూస్తుందని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన 26 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమం బుధవారం విజయవాడ ఎంబీపీ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు క్రమబద్ధీకరించిన ఇళ్ల పట్టాల ద్వారా రూ.52 వేల కోట్ల ఆస్తిని అందించాం. దశాబ్దాలుగా ఇల్లు ఉన్నా సొంతం అని చెప్పుకోవటానికి లేదు. మీ బాధను, అభద్రతా భావాన్ని చూసి రాష్ట్రంలో 60 వేల మందికి పట్టాలు అందించాం." అని చంద్రబాబు తెలిపారు. పుష్కరాల నాటికి కృష్ణా, గోదావరి నీటిని పుష్కలంగా తీసుకొస్తామన్నారు. రానున్న రోజుల్లో కరువు అనేది కనిపించకుండా కృష్ణాడెల్టా, రాయలసీమను సన్యశ్యామలం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలుగా మహిళలు సత్తా చాటుతున్నారని, విశాఖపట్నం, విజయవాడలో మహిళ పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో విజయవాడ- అమరావతి-గుంటూరు.. అన్ప్లవబుల్ సిటీగా మారిపోతుందని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
పేదల ఆనందమే నిజమైన అభివృద్ధి
"విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిన పెట్టాం. ఆశీర్వదించండి. మా గెలుపు మీ బాధ్యత, మీ బాధ్యత మాది. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేశాం. మిత్రుడు పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ నర్కార్ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. విశాఖపట్నంలో 28 వేలు, మంగళగిరిలో 5,800, విజయవాడలో 26 వేల మందికి.. ఇలా మొత్తం 60 వేల మందికి క్రమబద్ధీకరణ చేసిన పట్టాలిచ్చాం. ఒక లబ్దిదారుడికి సగటున 130 చదరపు గజాల స్థలం ఇచ్చాం. దీని విలువ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంది. కొంతమందికి రూ.2 కోట్లు కూడా విలువ చేస్తుంది. లబ్ధిదారుల సంతోషం చూస్తుంటే.. అన్ని వండుగలు ఒకేసారి జరుపుకొంటున్నట్టుగా ఉంది. పేదలంతా ఆనందంగా ఉంటే అదే నిజమైన అభివృద్ధి. ఇది ఎన్డీఏ సిద్ధాంతం. విశాఖపట్నం, మంగళగిరి, వట్టిచెరుకూరు, శెట్టిపల్లి, కైకలూరు, అమలాపురం తదితర చోట్ల 120 సంవత్సరాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపాం."
వట్టాలు అమ్ముకోవద్దు..
"గత వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన చేసింది. పట్టాదారు పాసు పుస్తకాలపై వాళ్ల బొమ్మలేసుకున్నారు. ఇప్పుడు మేం ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్రతో ఇస్తున్నాం. ఒక్క రూపాయి తీసుకోకుండా క్రమబద్దీకరిస్తున్న ఇంటి పట్టాలను అమ్ముకోవద్దు. అవసరమైతే వాటిని సెక్యూరిటీగా పెట్టుకుని పరిశ్రమలు పెట్టుకుని పైకి రండి. సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్రంలో రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాయలసీమకు జీవనాడి లాంటి హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేశాం. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేసి నల్లమల సాగర్ కు ఏడు టీఎంసీల నీటిని తీసుకొచ్చాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని తీసుకెళ్లాం. రాయలసీమను ప్రపంచంలోనే హార్టీ కల్చర్ హబ్ గా చేసేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం. గోదావరి నీళ్లు 3 వేల నుంచి 5 వేల టీఎంసీలు సముద్రం పాలవుతోంది. మార్చి నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. ఆ తర్వాత పోలవరం కుడికాల్వ ద్వారా విజయవాడకు ప్రతిరోజూ 2 టీఎంసీల వీటిని అందిస్తా. ఇక కరువు అనే మాట లేదు. నాకల గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేయటం. ఇది జరిగితే దక్షిణ రాష్ట్రాలకు నీటి కొరతే ఉండదు. ఇంటికొకరు పారిశ్రామికవేత్త కావాలన్నది నా ఆకాంక్ష, పేదలందరికీ ఇళ్లు కల్పించే బాధ్యత తీసుకున్నాం. 5.50 లక్షల మందికి ఇళ్లు పూర్తిచేసి ఇచ్చాం. మరో 5.50 లక్షల ఇళ్లు పూర్తిచేసి ఇస్తాం. మరో 3 లక్షల ఇళ్లకు ఈ నెలలోనే శంకుస్థావన చేస్తాం."
రాక్షనులను తరిమికొట్టాలి
"పూర్వం రుషులు యజ్ఞాలు, రాజులు యాగాలు చేసినప్పుడు రాక్షసులు వచ్చి అడ్డుకునేవారు. గొడ్డలి పార్టీ కూడా అదే చేస్తోంది. కూటమి వచ్చాక విజయవాడ-గుంటూరు నగరాల మధ్య భూముల విలువలు పెరిగాయి. రేపు ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఫోర్ లైన్ రైల్వే లైన్లు వస్తాయి. ఇవన్నీ…
వస్తే అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు ఒక్కటైపోయి అనాపబుల్ సిటీ అయిపోతుంది." అని చంద్రబాబు తెలిపారు. "ప్రభుత్వం మీకు చేసిన మంచిని మీరుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఒక్కో లబ్దిదారు పెడితే 26 వేల టెస్టిమోనియల్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. పేటీఎం బ్యాచ్ పత్తా లేకుండా పోతుంది." అని చంద్రబాబు అన్నారు.
వంద కౌంటర్లలో పత్రాలు వంపిణీ
పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్దిదారులకు విజయవాడ ఎంబీపీ స్టేడియంలో 100 కౌంటర్ల ద్వారా హక్కు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. సీఎం సభ పూర్తయిన వెంటనే లబ్దిదారులకు ఈ పత్రాలు జారీ చేశారు. సాయంత్రం వాటిని 20వేల పత్రాలు హక్కుదారులకు అందించినట్లు ఎన్టీఆర్ జిల్లా అధికారులు ప్రకటించారు. మిగిలిన వారికి సంబంధిత స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు నచివాయాల్లో అందిస్తామని వెల్లడించారు.
పేలిన సోడాలు నింపే సిలిండర్
సీఎం చంద్రబాబు బహిరంగ సభ జరిగిన ప్రాంగణానికి అతికొద్ది దూరంలో సోడాల్లో గ్యాస్ నింపే సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఎంబీపీ స్టేడియానికి 60 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో ప్రజలు, పోలీసులు కంగారుపడ్డారు. పెట్టారు. తొలుత వంటగ్యాస్ సిలిండర్ అని పోలీసులు సిలిండర్ పేలిన ప్రాంగణానికి పోలీసులు వరుగులు భావించారు. తీరా సోదాల్లో గ్యాస్ నింపే సిలిండర్ అని క్షేత్ర స్థాయి వరిశీలన అనంతరం తేల్చారు.