రేపు, ఎల్లుండి ఢిల్లీలో భారత్ అధ్యక్ష
బాధ్యతల్లో బ్రిక్స్ సదస్సు
డిజిటల్ కరెన్సీ ప్రతిపాదనపై చర్చ
రేపు పుతిన్.. ఎల్లుండి జిన్ పింగ్
ప్రధాని మోడీ చర్చలు భారీ పోలీసు బందోబస్తు..
ఢిల్లీలో నిషేధాజ్ఞలు 35 రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు..
22 ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు
న్యూఢిల్లీ: భారత్ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో స్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టిన నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిక్స్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుగుతున్న ఈ సదస్సుపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. ప్రపంచ స్థాయి నేతలు హాజరపుతున్న నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయాలు, హోటళ్లు, భారత్ మండవం వరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 30 వేల మంది భద్రతా సిబ్బందిని విధుల్లో మోహరించినట్లు సమాచారం. కీలక మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల తనిఖీలు, హోటల్ సిబ్బంది నేపథ్య పరిశీలన వంటి చర్యలు చేపట్టారు. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నేతలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక సహకారం, వాణిజ్యం, సాంకేతికత, ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆరోగ్యం, వివత్తుల నిర్వహణ, కీలక సరఫరా వ్యవస్థల బలోపేతం వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా నేతలు చర్చించనున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అంతరాయాల నేపథ్యంలో సప్లయ్ చైన్ ను మరింత పటిష్టం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ప్రస్తు తం కొనసాగుతున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు సదస్సులో కీలక అంశంగా సరసున్నాయి, ఇరాన్, యూఏఈ మధ్య విభేదాలు బ్రిక్స్లోలో ఏకాభిప్రాయ సాదనకు సవాలుగా మారా యి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సంక్షో భంపై సభ్య దేశాల మధ్య సమతుల్వ వైఖరితో ఉమ్మడి ప్రకటన తీసుకురా పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
డిజిటల్ కరెన్సీలపై భారత్ ప్రతిపాదన
బ్రిక్స్ దేశాల మధ్య సరిహద్దు చెల్లింపులను సులభతరం చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను అసునంధా నించే ప్రతిపాదనను భారత్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. సభ్య దేశాల డిజిటల్ కరెన్సీల మధ్య పరస్పర అనుసంధానం ఏర్పడితే అంతర్జాతీయ చెల్లింపులు వేగంగా, తక్కువ బర్చుతో జరిగే అవకాశం ఉందని భారత్ భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు సాంకేతిక, రాజకీయ పరమైన నవాళ్లు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
మోడీ-జిన్సెంగ్ భేటీపై ఆసక్తి
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసాతో పాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్జెల్ ఫత్తా ఎల్-సిసి, ఇథియోపియా ప్రధాని అవీ అహ్మద్. ఇండా "నేషియా అధ్యక్షుడు ప్రబోవోనుబియాంటో, యూఏఈలోని అబుదాబి యువరాజు షేక్ బలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరోవీరాతో పాటు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటె డ్రెస్.. హాజరు కానున్నారు. వీరితో పాటు బెలారస్, కజికిస్థాన్, క్యూబా, నైజీరియా, ఉ క్బెకిస్థాన్ అధ్యక్షులు, మలేషియా, థాయిలాంద్ ప్రధానులతో పాటు ఉగాండా ఉపాధ్యక్షుడు హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు జన్‌సింగ్ ఏడేళ్ల తర్వాత శనివారం నాడే భారత్‌కు పస్తుండటంతో మోదీ-జి న్సింగ్ భేటీపై ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా ప్రధాని మోడీ కీలక చర్చలు జరపనున్నారు.
ఆహ్వానం అందలేదు.. వెళ్లడం లేదు: బంగ్లాదేశ్
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు బంగ్లాదేశ్ దూరంగా ఉండే అపకాశాలు ఉన్నాయి. ప్రధాని తారిక్ రెహమాన్ భారత్‌లో పర్యటించే అవకాశాన్ని బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. సరైన రీతిలో తమ ప్రధానికి ఆహ్వానం అందలేదని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హుమాయున్ కనీర్ పేర్కొన్నారు. రెహమాన్‌కు ఆహ్వానం బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి హోదాలో కాకుండా దక్షిణాసియా, యా. తూర్పు ఆసియా దేశాల కూటమి (బిమ్ క్) చైర్మన్ హోదాలో ఇచ్చారని కబీర్ సమాచారమిచ్చారు.
దీర్ఘకాలిక స్థిరత్వంపై దృష్టి
బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులతో భేటీలో ప్రధాని మోడీ
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖులు చేశారు. దీర్ఘకాలిక స్థిరత్వంపై దృష్టి సారించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని మోదీ పేర్కొ న్నారు. బహుపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయ దం, ప్రపంచ పాలనలో అభివృద్ది చెందుతున్న దేశాల పాత్ర ను పెంచడం బ్రిక్స్ లక్ష్యాల్లో కీలకమని స్పష్టం చేశారు. స్యూఢిల్లీలో గురువారం తనను కలిసిన బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులతో మోదీ సంభాషించారు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలకుగళం విప్పడానికి బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా ఆవిర్భవించిందని అన్నారు. అంతర్జాతీయ సమస్యలకు చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పదేపదే నొక్కిచెబుతోంది. ఇటీవల రష్యా 1. అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన సమావేశంలోనూ మోడీ ఇదే వైఖరిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.