సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ వీడియోపై శాలిని పాండే ఓపెన్ గా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో తనది కాదని, పూర్తిగా ఏఐతో తయారు చేసిన ఫేక్ వీడియో అని ఒక పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. కొంతకాలంగా ఆ క్లిప్ షేర్ అవుతుండటంతో అసలు అది నిజమేనా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఇప్పుడు శాలినే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా దీనిపై మాట్లాడారు. ఆ వీడియోలో కనిపిస్తున్నది తాను కాదని శాలిని స్పష్టంగా తెలియజేశారు. తనను చూపిస్తున్నట్లుగా మొత్తం వీడియోను తయారు చేశారని, టెక్నాలజీని ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి వాడటం చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా మహిళలను ఇలాంటి షేక్ కంటెంట్‌తో ఇబ్బంది పెట్టడం మరింత బాధ కలిగిస్తోందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఏఐ వీడియోలను ఒక సాధారణ విషయంగా తీసుకోవద్దని కూడా శాలిని కోరింది. ఎవరైనా ఆ వీడియోను చూసినా షేర్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు, డౌన్లోడ్ కూడా చేయొద్దని చెప్పారు. దానిపై కామెంట్ చేయడం లేదా ఇంకేదైనా రియాక్షన్ ఇచ్చి మరింత మందికి చేరేలా చేయవద్దని, దాని బదులు వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పారు. ఈమధ్య కాలంలో ఏఐ టెక్నాలజీతో ఎవరి పోటో అయినా తీసుకుని కంటెంట్ తయారు చేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ దాని వల్ల టార్గెట్ అయిన వ్యక్తికి వచ్చే ఇబ్బందిని పట్టించుకోకుండా అలాంటి వీడియోలను వైరల్ చేయడం సరికాదని చాలామంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు షాలిని మాటల్లో కూడా కనిపించింది. అందుకే దానికి మరింత రీచ్ ఇవ్వకుండా ఆపాలని కోరారు.