మరింత ముదురుతున్న యుద్ధ వాతావరణం
అమెరికా, ఇరాన్‌ల మధ్య పరస్పర దాడులు
పెళ్లి వేడుకపై అమెరికా క్షిపణి దాడి
ఐదుగురు మృతి, 50 మందికి గాయాలు
ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ సైన్యం
ప్రతీకారం తీర్చుకుంటాం..
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అమెరికా దాడులతో మళ్లీ అనిశ్చితి ఏర్పడింది. మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్ సీ దాడి చేసింది. కువైత్, బహ్రెయిన్ లో కూడా పేలుళ్లు సంభవించాయి. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి వల్ల ఓ పెళ్లింట విషాదం సంభవించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారని, 50 మంది గాయపడ్డారని తెలిపింది. ఈ ఉదంతంపై ఇరాన్ సుప్రీం లీడర్ మండిపడ్డారు. యూఎస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యూఎస్‌కు తమ సైన్యం మర్చిపోలేని గుణపాఠం చెబుతుందని ఐఆర్టీసీ ప్రతినిధి హుస్సేన్ మొహబి పేర్కొన్నారు. ఈ దాడులు ఎందుకు చేశామా? అని చింతించేలా చేస్తామని హెచ్చరించారు. అయితే, హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజా ము వరకూ దాడులు కొనసాగాయని పేర్కొంది. ఇక తమ భూభాగం వైపు వస్తున్న 13 బాలిస్టిక్ మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేశామని జోర్డాన్ మిలిటరీ పేర్కొంది. మరో మూడు మిసైల్స్ నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయాయని తెలిపింది. ఇరాన్ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది. బుధవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన పలు మిసైల్స్‌ను అడ్డుకున్నామని మరో ప్రకటనలో కువైట్ తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలిసింది. అమెరికా దాడుల్లో చిన్నారి మరణించినట్టు ఇరాన్ మీడియాలో వార్తలు రావడంపై యూఎస్ సెంట్ కామ్ ప్రతినిధి స్పందించారు. ఇరాన్ దళాల లాగా తాము సామాన్య పౌరులను ఏనాడు టా+-గం+ట్ చేయలేదని స్పష్టం చేశారు. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ కౌంటీలో ఉన్న కుహెస్తక్ నగరంలో ఘోరం జరిగింది. ఒక నివాస గృహంలో జరుగుతున్న పెళ్లి వేడుకపై అమెరికా సేనలు క్షిపణితో దాడి చేశాయి. ఈ భయంకరమైన దాడిలో ఒక చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ రెడ్ క్రెసెంట్ ప్రకటించింది. ఈ దారుణ ఘటనపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇదొక అత్యంత క్రూరమైన నేరమని అభివర్ణించింది. అమెరికా చేసిన ఈ దారుణ కాండకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. అమాయకులైన పౌరులపై జరుగుతున్న ఈ దాడులను చూస్తూ అంతర్జాతీ య సమాజం మౌనం వహించడం అత్యంత ప్రమాదకర మని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మౌనంగా ఉన్న దేశాలు రేపు తమ వంతు వచ్చినప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని బమాయీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ళ్లి జరుగుతున్న ఇల్లు అమెరికా క్షిపణి శకలాలు తగలడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇలంతా శిథిలాల మయంగా మారిన ఆ వీడియోలు అందరినీ కలచివేస్తున్నాయి. అయితే సిరిక్ కౌంటీలో ఏ లక్ష్యాన్ని ఛేదించేందుకు అమెరికా ఈ దాడి చేసిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పెళ్లి వేడుకపై జరిగిన ఈ దాడికి సంబంధించి అమెరికా ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమాయకుల ప్రాణాలు తీసిన అమెరికాపై ఇరాన్ ఇప్పటికే ప్రతీకార దాడులు ప్రారంభించింది. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఇరాక్ దేశాల్లో ఉన్న అమెరికా అనుబంధ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ బలగాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో, దక్షిణ ఇరాన్ పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కొన్ని నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితులు పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అమెరికా దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దీటుగా బదులిస్తామని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తోంది. మరోవైపు ఇరాన్ గనక మరిన్ని దాడులకు పాల్పడితే తీవ్రమైన సైనిక చర్యలు తప్పవని వాషింగ్టన్ కౌంటర్ వార్నింగ్ ఇస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో పెను యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.