వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా టీమిండియా నూ ఇప్పటి నుంచే సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. త్వరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టును పరిశీలిస్తే.. రాబోయే ప్రపంచకప్‌లో భారత్ తరపున బరిలోకి దిగే 15 మంది ఆటగాళ్లు ఎవరనేదానిపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇంగ్లాండ్ పర్యటన కోసం బలిష్టమైన వన్డే జట్టును ప్రకటించింది. జూలై 19 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కేవలం ద్వైపాక్షిక సమరం మాత్రమే కాదు.. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ నకు పునాది అని విశ్లేషకులు భావిస్తున్నారు. జట్టులో సీనియర్ల పునరాగమనం, కుర్రాళ్ళకు దక్కిన అవకాశాలను బట్టి చూస్తే, రాబోయే నాలుగేళ్ల పాటు వన్డేల్లో కొనసాగే కోర్ టీమ్ ఇదేనని స్పష్టమవుతోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో సెలెక్షన్ కమిటీ దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఈ అడుగులు వేసింది. ఈ సిరీస్ కోసం భారత జట్టులోకి రన్‌మెషీన్ విరాట్ కోహ్లి తిరిగి వచ్చారు. అయితే, అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డేలో కేవలం 86 బంతుల్లో 110 పరుగులతో అద్భుత శతకం బాదిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. జైస్వాల్ స్థానంలోనే కోహ్లి జట్టులోకి వచ్చారు. వీరితో పాటు స్టార్ పేసర్ జసీత్ బుమ్రా, ఆల్ రౌండర్ అక్ష అక్షర్ పటేల్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. అఫ్గాన్ సిరీస్‌లో లో ఆకట్టుకున్న ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే వంటి యువ ఆటగాళ్లను సీనియర్ల కోసం పక్కన పెట్టక తప్పలేదు. మెగా టోర్నీల అనుభవం దృష్ట్యా పెద్ద లీగ్ లో సీనియర్లకే గంభీర్ మొగ్గు చూపుతారని దీన్నిబట్టి అర్థమవుతోంది. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్ కు తెలుగు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్నెస్ లేకపోవడం వల్లే నితీష్‌కు ఈ అవకాశం దక్కింది. అయితే, ప్రపంచకప్ 2027 నాటికి హార్దిక్ పాండ్యా గనుక పూర్తి ఫిట్నెస్ సాధిస్తే జట్టులో ఆయనకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఐసీసీ టోర్నమెంట్లలో హార్దిక్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉన్నందున, ఆయన జట్టులో ఉండటం ఖాయం. ఒకవేళ హార్దిక్ అందుబాటులో లేకపోతే బ్యాకప్ ఆల్ రౌండర్‌గా నితీష్ రెడ్డి రేసులో నిలుస్తారు.
ప్రపంచకప్ 2027 రేసులో ఉండే ఆ 15 మంది అంచనా జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్హదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, జస్ర్పీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా.
భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌ల సమయాల్లో కీలక మార్పు
భారత్, ఐర్లాండ్ మధ్య జరగనున్న రెండు టీ20 మ్యాచ్‌ల సమయాలను గంట ముందుకు జరిపారు. తొలుత సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు ఇప్పుడు సాయంత్రం 6 గంటలకే మొదలుకానున్నాయి. జూన్ 28న జరిగే రెండో టీ20 మ్యాచ్, మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో సమయం కలిసిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ ఐర్లాండ్, భారత ప్రసార భాగస్వాముల మధ్య చర్చల తర్వాత మ్యాచ్ సమయాల్లో మార్పు చేశా చేశారు. బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా జూన్ 26, 28 తేదీల్లో ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, ఐర్లాండ్ జట్టుకు లోర్కన్ టక్కర్ నాయకత్వం వహించనున్నాడు.