రాజధాని అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై.. క్లాప్ కొట్టి, కెమెరా స్విచైన్ చేశారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా మొదటి షాట్‌ను డైరెక్ట్ చేసిన నందమూరి తేజస్వినికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధప్రదేశ్‌లో పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 సంవత్సరాలు సంవత్సరాలు అయ్యిందన్నారు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని బాలయ్య తెలిపారు. సినీ ఇండస్టీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. సినిమాతో పాటు థియేటర్ ఎకనామిని ప్రోత్సహిస్తామన్నారు. ఎఐ టెక్నాలజీతో సినిమా పరిశ్రమను మరింత ఉన్నతికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు అమరావతి నుంచే ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. త్వరలో సినీ పరిశ్రమకు చెందిన స్టూడియో కూడా రావాలని కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు బాలయ్య బాబు కోసం ఒక సినిమా రాశానని దర్శకుడు కొరటాల శివ అన్నారు. రైటర్ గా కూడా ఒక సినిమా రాసినట్లు చెప్పారు. ఇప్పుడు బాలయ్య బాబుకు దర్శకత్వం వహించడం తన అదృష్టమని శివ చెప్పుకొచ్చారు.