టీమిండియా తొలి మ్యాచ్ లో అమెరికాతో తలపడి విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో నమీబియాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో చోటు దక్కని ఇద్దరి ప్లేయర్లు రెండో మ్యాచ్ లో ఆడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కోచ్ గంభీర్ కూడా ఈ ఇద్దరిని ఆడించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ లో ఈ ఇద్దరు టీమిండియా యాజమాన్యాన్ని ఆకట్టుకున్నారని, అందుకే నమీబియాతో ఆడించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం లీగ్ దశ మ్యాచ్ లు జరగుతున్నాయి. అన్ని జట్లు కూడా తమ స్వాడ్ లను బలోపేతం చేసేందుకు బెంచ్ ఆటగాలకు కూడా అవకాశాలు ఇవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలో టీమిండియా కూడా తమ బెంచ్ బలాన్ని టెస్ట్ చేయాలని చూస్తోంది. అందుకే సూపర్ 8 కు ముందు బెంచ్ ఆటగాళ్లను బరిలోకి దించనుంది. ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్ కు ముందు ప్లేయింగ్ 11లో మార్పు జరగనుంది. తొలి మ్యాచ్ మిన్సయిన ఫాస్ట్ బౌ లర్ జస్ప్రిత్ బుమ్రా జట్టులోకి రావడం ఖాయమైంది. మహ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రా రావొచ్చని భావిస్తున్నారు. కానీ తొలి మ్యాచ్ లో సిరాజ్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. మరి నమీబియాతో సిరాజ్ ను తప్పించే ప్రయత్నం చేస్తారా లేదా అని చూడాలి. అలాగే, రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో రింకూ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో లీగ్ దశలోనే కాంబినేషన్ ప్రయత్నాలు చేసేందుకు గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. బుమ్రా స్థానంలో ప్లేయింగ్ 11లోకి వచ్చిన సిరాజ్.. కీలక దశలో అమెరికా 2 వికెట్లు పడగొట్టి, భారత జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తన 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు రింకూ సింగ్ కేవలం 14 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. భారత జట్టు తదుపరి మ్యాచ్ లను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 12 న నమీబియాతో, ఫిబ్రవరి 15 న పాకిస్తాన్ జట్టుతో, ఇక చివరి మ్యాచ్ ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్ తో తలపడనుంది. ముఖ్యంగా నమీబియాతో మ్యాచ్ లో ప్రయోగాలకే పట్టం కట్టేందుకు గంభీర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన జట్టుతో మ్యాచ్ జరుగుతుందా లేదా తెలియదు. ఒకవేళ జరిగితే, దాయాదిపై బలమైన జట్టుతో బరిలోకి దిగాలని గంభీర్ చూస్తున్నాడు.
కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
టీ20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. అయితే అతికష్టమ్మీద తొలి మ్యాచులో అమెరికాపై భారత జట్టు 29 పరుగుల తేడాతో నెగ్గిందని తెలిసిందే. అయితే నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఓ నవాల్ ఎదురైంది. తరువాత మ్యాచ్‌లో గత మ్యాచ్ స్టార్ కు అవకాశం దక్కపోవచ్చు. మహమ్మద్ సిరాజ్ తరువాత మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అభిషేక్ శర్మ ఆరోగ్యం కూడా బాగాలేదని, మరోవైపు జస్ర్పీత్ బుమ్రా కూడా అనారోగ్యం కారణంగానే తొలి మ్యాచ్ ఆడలేదని తెలిసిందే. భారత క్రికెట్ జట్టు లో వరుస విజయాలు సాధిస్తున్న జట్టుగా నిలిచింది. గత వరల్డ్ కప్ లో ఒక్క ఓటమి కూడా లేకుండా రోహిత్ శర్మ జట్టుకు ట్రోఫీని అందించాడు. ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచులో భారత బ్యాటర్లు అమెరికా బౌ లర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మినహాయిస్తే, మరే ఇతర బ్యాటర్ అంతగా రాణించలేదు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే గోల్డెన్ డక్ కాగా, అభిషేక్ ఆ తర్వాత ఫీల్డింగ్ చేయడానికి కూడా ఫీల్డ్ లోకి దిగలేదు. అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని అతడికి కడుపునొప్పి, అస్వస్థత అని సూర్యకుమార్ ధృవీకరించాడు. వాతావరణం కారణంగా స్టార్ పేసర్ జస్రీత్ బుమ్రాకు జ్వరంతో బాధ పడుతున్నాడు. మరోవైపు అభిషేక్ పరిస్థితి దాదాపు అంతేనని సూర్యకుమార్ చెప్పాడు. అయితే, అభిషేక్‌కు కడుపు నొప్పి ఉందని, నెక్స్ట్ మ్యాచ్ నమీబియాతో బరిలోకి దిగుతాడని సిరాజ్ తెలిపాడు. అంతా బాగానే ఉంది, కడుపు నొప్పి, స్వల్ప అస్వస్థత కారణంగా ఫీల్డింగ్ చేయడానికి రాలేదని తెలిపాడు. నమీబియాతో జరిగే మ్యాచ్‌లో సిరాజ్ జట్టు నుంచి బయటకు వెళ్లనున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఢిల్లీలో టీమిండియాతో చేరతాడని సూర్యకుమార్ తెలిపాడు. భారత్ తమ నెక్స్ట్ మ్యాచ్ గురువారం, ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడనుంది. జస్ప్రిత్ బుమ్రా కోలుకుని తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది. జస్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ కారణంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ ఆడలేదు, అందుకే అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు ప్లేయింగ్ 11లో అవకాశం ఇచ్చారు. సిరాజ్ టోర్నమెంట్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు జట్టుతో చేరాడు. హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన సిరాజ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యుఎస్ఎతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున మహ్మద్ సిరాజ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. పవ・లోనే 2 వికెట్లు తీసి అమెరికాను దెబ్బతీసి జట్టుకు మంచి ప్రారంభం అందించాడు. కానీ నమీబియాతో మ్యాచ్ బుమ్రా ఆడితే, సిరాజ్ ప్లేయింగ్ 11లో చోటు కోల్పోతాడు. తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసినా బుమ్రా జట్టులోకి రావడంతో సిరాజ్‌ను బయటకు పంపించవచ్చు.