విజయానికి చేరువలో టీమిండియా
ముందే ముగిసిన నాలుగో రోజు ఆట..
భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. అయితే, కీలకమైన నాలుగో రోజు ఆటలో వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను ముందుగానే రద్దు చేశారు. ఆట ముగిసే సమయానికి, ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల సష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, మ్యాచ్ పూర్తిగా భారత్ నియంత్రణలో ఉంది. నాలుగో రోజు ఉదయం శ్రీలంక తొలి ఇన్నింగ్స్్సు 290 పరుగుల వద్ద ముగించిన భారత్, వెంటనే ఫాలోఆన్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో పోలిస్తే రెండో ఇన్నింగ్స్ శ్రీలంక బ్యాటర్లు మెరుగైన ఆటతీరు కనబరిచారు. ముఖ్యంగా, మరోసారి అద్భుతంగా ఆడిన పసిందు సూరియబండార (92), కమిందు మెండిస్ (55) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి, శ్రీలంకకు మంచి ఆధిక్యం అందించేలా కనిపించారు. వీరి నిలకడతో శ్రీలంక శిబిరంలో అశలు చిగురించాయి. అయితే, దూకుడుగా ఆడే క్రమంలో కమిందు మెండిస్ చేసిన ఒక పొరపాటు మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి స్వేర్ లెగ్ వద్ద గాల్లోకి బంతిని లేపాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న శు భీమన్ గిల్ వెసక్కి పరుగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో శ్రీలంక పతనం ప్రారంభమైంది. ఆ వికెట్ పడిన తర్వాత టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కొద్దిసేపటికే, సెంచరీకి చేరువలో ఉన్న సూరియబండారను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత పచ్చిన కెప్టెన్ ధనంజయ డి సిల్వా (23), నిరోషన్ డిక్వెల్లా (6) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి, సోనల్ దిసుషా (7), కేశర సువంత (3) క్రీజులో ఉన్నారు. మరో 8 ఓవర్లలో కొత్త బంతి అందుబాటులోకి రానుండటం భారత బౌలర్లకు మరింత అనుకూలించే అంశం. ఐదో రోజు వర్షం ముప్పు ఉ స్నప్పటికీ, వాతావరణం అనుకూలిస్తే మ్యాచ్ ఫలితం తేలడం ఖాయం. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ మరో 1 వికెట్లు పడగొట్టి, ఆపై లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. బౌలర్లలో మాసవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిద్ధి, జడేజా, సారాంశ్ జైన్ తలో వికెట్ సాధించారు.