పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం
దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచిన పార్టీ టీడీపీ
మహిళా రిజర్వేషన్లు సాధించి చరిత్ర తిరగరాస్తాం
45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై తెదేపా పోరాటం
మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత
ఈ మహానాడు మహిళలకు అంకితం ఇస్తున్నాం
23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు
మహానాడు మోడల్ మారింది తప్పు.. విధానం మారలే
వైసీపీ హయాంలో అణచివేతలను ఎదుర్కొని నిలబడ్డాం
మహానాడు ప్రారంభోపన్యాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి: విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని... ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. 1875 క్లస్టర్ వేదికగా ఈసారి మహానాడు జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. లక్షలాదిమంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారని ప్రశంసించారు. పశ్చిమాసియా యుద్ధవాతావరణం మూలంగా మహానాడును వర్చువల్
నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనను టీడీపీ పరిచయం చేసిందని ప్రస్తావించారు. జెండర్ ఈ క్వాలిటీ, సామాజిక సమస్యలపై తెలుగుదేశం పోరాడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ జెండా దేశానికి గౌరవం.. పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వానమని చంద్రబాబు అన్నారు. రెండ్రోజుల పాటు జరిగే మహానాడు ప్రారంభం సందర్భంగా ఆయనమాట్లాడారు. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్‌కు నాంది తెలుగుదేశమని తెలిపారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచిన పార్టీ తెదేపా అని కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరినీచిన ఏకైక ప్రాంతీయ పార్టీ మనదని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్లు సాధించి చరిత్ర తిరగరాస్తామని ధీమా వ్యక్తంచేశారు. కూడు, గూడు నీడ లాంటి సంక్షేమ విధానాలతో తెదేపా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై తెదేపా పోరాటం చేస్తూనే ఉందన్నారు. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు వచ్చినా ప్రజా పోరాటాలు ఆపలేదని గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. మహిళల వంటింటి కష్టాలు తగ్గేందుకు నాడు గ్యాస్ కనెక్షన్ ఉ చితంగా ఇచ్చాం. నేడు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉ చితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు ఆర్థిక, సామాజిక గౌరవమిస్తున్నాం. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పించాం. తల్లికి వందనం వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నాం. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అని నిరూపించాం. గంజాయి, డ్రగ్స్‌పై అత్యంత కఠినంగా ఉన్నాం. సోషల్ సైకోల తాటతీసి, మహిళల గౌరవాన్ని కాపాడుతాం. నాడు ఒక్క ఐటీనే.. యువత తల రాత మార్చింది. తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు పెరిగాయి. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వంటివన్నీ రాష్ట్రానికి వస్తున్నాయి. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పాం. ఎంవోయూలన్నీ పూర్తయితే ఇది సాధ్యమే. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై మాట్లాడాం. ఇప్పుడు గేర్ మార్చాం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై మాట్లాడుతున్నాం. ఏ ప్రాజెక్టు వచ్చినా మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం. 288 ప్రాజెక్టులు ప్రారంభించే రోజు కూడా నిర్ణయించేశాం అని సీఎం తెలిపారు. పర్చువల్ మహానాడు కారణంగా వాహానాల హోరు తగ్గిందేమో కానీ... కార్యకర్తల్లో జోరు మాత్రం తగ్గలేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అన్ని క్లస్టర్లను అనుసంధానించి మహానాడును నిర్వహిస్తున్నామని తెలిపారు. యుద్ధం వల్ల మహానాడును హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని వివరించారు. మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు విధానం మారలేదని అన్నారు. భవిష్యత్తు గురించి అన్ని విషయాలు చర్చించుకుందామని తెలిపారు. కూడు, గూడు, నీడలాంటి సంక్షేమ విధానాలతో టీడీపీ ఆవిర్భవించిందని ప్రస్తావించారు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి గౌరవం, ఆత్మవిశ్వాసమని ఉద్ఘాటించారు. ప్రతీ ఒక్కరికీ తెలుగుదేశం జెండా చూస్తేనే నమ్మకం, భరోసా కలుగుతోందని తెలిపారు. నాటికీ, నేటికి టీడీపీపై ప్రజలకు ఆదరణ చెక్కు చెదరలేదని చెప్పారు. 45 ఏళ్లుగా ప్రజాసమస్యల కోసం టీడీపీ నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు వచ్చినా టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజా పోరాటాలు ఆపలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 'వైసీపీ హయాంలో పీకలు కోస్తున్నా.. టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాను వీడలేదు. చంద్రయ్య లాంటి కార్యకర్తను నరుకుతున్నా.. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినదించి అమరుడయ్యారు. ఆయన స్పూర్తి కలకాలం నిలుస్తోంది. అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, లోకేశ్ యువగళాన్ని అడ్డుకున్నారు. మన నేతలను అరెస్టు చేశారు. బాధితులనే నిందితులుగా చేశారు. అయినా టీడీపీ వెనకడుగు వేయలేదు. ప్రజాస్వామ్యం కోసం టీడీపీ నిలిచిందని అంటూ వివరించారు. ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత అప్పగించారు. పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్నాం. మహిళా సాధికారిత, సామాజిక, ఆర్ధిక రాజకీయ గౌరవం కోసం టీడీపీ పనిచేస్తోంది. ఆస్తి హక్కు నుంచి.. నేడు తల్లికి వందనం వరకూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటంతో పాటు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ టీడీపీ వారి వెనుక ఉంటుంది. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చాం. ఇది చూసే నా చిన్నప్పుడు ఇష్టంగా నడిపిన రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రాష్ట్రానికి వచ్చింది. 1875 ప్రాంతాల్లో మహానాడు హైబ్రిడ్ సమావేశం జరుగుతోంది. ఏ తీర్మానానికి ఎంతమంది ఆమోదం తెలిపారో రియల్ టైంలో వస్తున్నాయి. బెస్ట్ టెక్నాలజీ ప్లస్‌ని ఇక్కడికి తెస్తామని యువతకు విజ్ఞప్తి చేస్తున్నా' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.