నేపాల్‌లో ఆకస్మిక వరదలు
వరదల్లో వందలాది మంది గల్లంతు
అందులో 105 మంది భారతీయులున్నట్లు అంచనా
టిబెట్‌లో భారీ వర్షాలతో ఉప్పొంగిన కోశీనది బురదమయంగా మారిన కొండతీర ప్రాంతం
నేపాల్‌లో బుధవారం ఉదయం అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వరదలు అనేక మందిని పొట్టనపెట్టుకున్నాయి. 105 మంది భారతీయులు కూడా ఈ విపత్తులో గల్లంతయ్యారు. ఓ అంచనా ప్రకారం 1500 మంది గల్లంతయ్యారని అంటున్నారు. చైనాతో సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలోని భోటే కోశీ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో తీరంలోని అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో నేపాలు దిగువన ఉన్న బిహార్, యూపీ రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. మరోవైపు, ఈ అకస్మిక వరదలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు నేపాల్ అధికారులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆకస్మిక వరదలు కేవలం గంటల వ్యవధిలోనే విరుచుకుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో కుండపోత వర్షం కురిసినా, లేదా నదీప్రవాహానికి అడ్డుగా ఉండే కొండచరియలు విరిగి పడిన సందర్భాల్లో కూడా ఆకస్మిక పరదుల దిగువన ఉన్న ప్రాంతాలను ముంచెత్తుతాయి. కొండల్లోని మంచు కరగడంతో ఏర్పడే గ్లేషియల్ సరస్సులు ఆస్థిరమై ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చిన సందర్భాల్లో కూడా లోతట్టు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయి. అంతెత్తున ఉండే కొండల నుంచి కిందకు వేగంగా దూసుకొచ్చే నీటి ప్రవాహానికి తన దారిలో ఉన్న అన్ని నిర్మాణాలను నేలమట్టం చేయగల శక్తి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, రనువా జిల్లాలో పర్షాలకు అవకాశం తక్కువని అక్కడి వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. కానీ నేపాల్‌కు ఎగువన ఉన్న టిబెట్‌లో భారీ వర్షం కురిసిన విషయం శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై తమను ముందస్తుగా హెచ్చరించడంలో చైనా విఫలమైందని ఇప్పటికీ నేపాల్ జర్నలిస్టు ఒకరు నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాలయాల్లో ఉన్న నేపాల్‌లో భారీ పర్వతాలు, వాటి నుంచి కిందకు వేగంగా దూసుకొచ్చే నదులతో ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో కురిసే వర్షాల కారణంగా కొండ కోసల్లో పోటెత్తే పరదలు చూస్తుండగానే మహోగ్రరూపం దాలుస్తాయి. ఇది చాలదన్నట్టు వాతావరణ మార్పులు పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి. భూతాపం పెరుగుతుండటంతో నేపాల్‌లోని కొండలపై ముంచు కరిగిపోతోంది. హిమసదాలు కనుమరుగు అవుతున్నాయి. ఫలితంగా కొండలపై భారీ గ్లేషియల్ సరస్సులు ఏర్పడుతున్నాయి. కొండప్రాంతాలు సహజంగా అస్థిరంగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో కొండచరియుల విరిగిపడ్డా లేక కాస్త ఎక్కువ వర్షం కురిసినా సరన్సులు కట్టలు తెంచుకుని దిగువనున్న ప్రాంతాలను ముంచెత్తే అవకావం ఉ టుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా నేపాల్ లో భారీ వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఆకస్మిక పరదలు ఊళ్లను ముంచెత్తుతున్నాయి. ఉదృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, థాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు నుంచి వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా పలు ఊళ్లు, బ్రిడ్జ్‌లు, ప్రాజెక్ట్‌లు నీటిలో కొట్టుకుపోయాయి. వరద బీభత్సం కారణంగా బుధవారం ఉదయం రనువా జిల్లాలో 1000 మంది నీటిలో కొట్టుకుపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు. పరదలో కొట్టుకుపోయిన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు మొదలయ్యాయి. అధికారులు 15 హెలికాప్టర్లసు రంగంలోకి దించారు. సహాయక సిబ్బంది బుసి, తుసు ప్రాంతాల్లో 20 మందిని రక్షించారు. గాయవద్ద వారిని మచిలి ట్రైనింగ్ క్యాంప్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నడీ వరివాహక ప్రాంతాల్లో నివసించే వారు వెంటనే అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఇప్పటి వరకు 8 మృతదేహాలను నీటినుంచి స్వాధీనం చేసుకున్నారు.
టిబెట్ భూకంపంతోనే వరదలు
నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్
టిబెట్‌లో సంభవించిన భూకంపం తమ దేశంలో వరదలకు కారణమై ఉండవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ఠిఠిర్ ఖనాల్ తెలిపారు. టిబెట్ లో కొండచరియలు విరిగి పడి తమ దేశంలోని భోటేకోశీ నదిలో వరదలకు దారి తీశాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు మంత్రి ఖనాల్ వివరించారు. టిబెట్‌లో నేడు ఉదయం 8.37 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 1.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే దానిపై నివుణులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, వరదలు ముంచెత్తిన రనువా జిల్లాకు అనుకుని ఉన్న టిబెట్ గ్విరోంగ్ పోర్టు ప్రాంతంపై భారీ వరద విరుచుకు పడ్డవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. +ళిపాల్-చైనా సరిహద్దుకు సమీపంలో ముంచుచరియలు, కొండచరియలు విరిగివడినట్టు శాటిలైట్ ఇమేజీల్లో కనిపించిందని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది అంతకుముందే, లేండే నదికి అడ్డంగా మంచుచరియలు పేరుకోవడంతో అక్కడ భారీగా నీరు నిలిచిపోయిందని ఖఠ్మాండూ యూనిర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. 69 తరువాత అకస్మాత్తుగా మంచుచరియలు, కొండచరియలు పడిపోవడంతో ఎగుపస ఉన్న లేండే సది నీరు ఖోటే కోశీ నదిలోకి పోటెత్తి ఆకస్మిక పరదలకు దారి తీసిందని చెప్పారు. ఆ సమయంలోనే టిబెట్‌లో భూకంపం సంభవించిందని వివరించారు. ఈ నేపథ్యంలో పూర్తి ఘటనా క్రమం ఎంటో తెలుసుకునేందుకు నేపాల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నేపాల్‌లో ప్రవహించే చోటే కోకీ సదికి లేందే ఓ ఉపనది. ఈ నది టిబెట్‌లో మొదలవుతుంది. సరిహద్దును దాటి నేపాల్‌లోకి ప్రవేశించాక భోటే కోశీ సదిలో కలుస్తుంది. అనంతరం భోటే కాశీ నది మరింత దిగపకు వచ్చేసరికి త్రిశూలీ నదిగా పిలుస్తారు. ఈ క్రమంలో త్రిశూలీ నది నేపాల్‌లోని దేవఘాట్ వద్ద కాళీ గండకి నదిలో కలిసి నారాయణి నదిగా భారత్‌లోకి (బిహార్) ప్రవేశిస్తుంది. భారత్‌లో దీన్ని గండక్ సదిగా పిలుస్తారు. బిహార్, యూపీల మధ్య సరిహద్దుమీదుగా ప్రవహిస్తూ అంతిమంగా గంగా నదిలో కలుస్తుంది. నేపాల్ వరదలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం దెబ్బతిన్నఇళ్లు, రోడ్లు, వంతెనలు, హైడ్రోవవర్ ప్రాజెక్టులు సహయక చర్యలకు దిగిన భద్రతా బలగాలు మెరుపు పరదలపై నేపాల్ ఎంబసీ బుధవారం సాయంత్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. నేపాల్‌లో భారీ వరదలు సంభవించాయని, వరదల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు పలువురు గల్లంతయ్యారని వెల్లడించింది. ఇళ్లు, రోడ్లు, పంతెసలు, హైడ్రోవపర్ ప్రాజెక్టులకు భారీ నష్టం జరిగిందని పేర్కొంది. నేపాల్ భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయని తెలిపింది. దిగువ ప్రాంతాలకు వరద ముప్పుపై నేపాల్ ప్రభుత్వం అలర్ట్ చేసిందని వెల్లడించింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. విదేశీ సాయం అవసరంపై ఖాట్మాండు నుంచే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. భారత్ తో నమస్వయానికి సిద్ధంగా ఉన్నామని నేపాల్ ఎంబసీ స్పష్టం చేసింది. భారత ప్రధాని సరేంద్ర మోదీ.. నేపాల్ ప్రధాని బాలెన్ షాతో బుధవారం ఫోన్లో మాట్లాడారు. మెరుపు వరదల కారణంగా జనం ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ సంతావం తెలిపారు. పరద పరిస్థితులపై ఆరా తీశారు. అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు.