సవాళ్లకు పరిష్కారాలు మీ చేతుల్లోనే
ఇదే సరైన సమయం.. అవకాశాల్ని అందుకోండి
దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వండి
రెండవ అతి పెద్ద మొబైల్ తయారీ కేంద్రంగా భారత్..
చెన్నైలో విద్యార్థులతో ప్రధాని మోడీ
చెన్నై: ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారా లను కనుగొనే దిశగా అడుగులు వేస్తోందని, వాటిని అందించే సామర్థం, ప్రతిభ భారత యువతకు ఉన్నాయని ప్రధాన మంత్రి సరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. యువతకు భారతదేశం ఆపారమైన అవకాశాలను కల్పిస్తోం దని పేర్కొన్న ఆయన.. తమ సామర్ధ్యాన్ని గుర్తించి దేశాభివృద్ధిలో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత రూపొందించే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారతదేశ భవిష్యత్‌ని కాకుండా ప్రపంచ భవిష్యత్‌ను కూడా తీర్చిదిద్దుతాయని ఆయన స్పష్టం చేశారు. సమష్టి కృషితో దేశ ఆశయాలను సాకారం చేసుకోవచ్చని ప్రధాని దీమా వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రధాని మోడీ ప్రసంగిం చారు. భారతదేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగ విస్తరణ యువ తకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశా లను కల్పించిం దని అన్నారు. భారత దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగా యని, అలాగే ఇంజనీ రింగ్ ఎగుమతులు కూడా సరికొత్త రికార్డును నెలకొల్పాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా భారత్ అవతరించిందని ప్రధాని తెలిపారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన వెల్లడించారు.
రూ.13వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు
ఐఐటీ-మద్రాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, తమిళనాడు. వ్యాప్తంగా రూ.13,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారం భించారు.. వాటికి శంకుస్థాపన చేస్తారు. వీటిలో దాదాపు రూ.3,700 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై ఓడరేవు, కామరాజర్ ఓడరేవు వీట చిదంబరనార్ ఓడరేవుల లో చేపట్టే కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ కూడా పాల్గొన్నారు.
విజయ్ కలిసి మెట్రో రైలు ప్రారంభం
దాదాపు రూ.4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశలోని పూనమల్లి-వడపళని మార్గాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తో కలిసి సంయుక్తంగా కొత్త మెట్రో సేవలను జెండా ఊపి ప్రారంబించి కొద్ది దూరం మెట్రో రైలులో ప్రయాణించారు. కొత్తగా ప్రారంభించిన ఈ మార్గంలో 15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 11 ఎలివే టెడ్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి.