500 విజయాల మైలురాయిని అందుకున్న తొలి భారత షట్లర్
ఇండోనేసియా మాస్టర్స్ లో ఘనత
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 500 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఇండోనేషియా మాస్టర్స్ 2026లో భాగంగా డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్మార్ను వరుస సెట్లలో ఓడించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్ చరిత్రలో మహిళల సింగిల్స్ లో ఇప్పటి వరకు ఈ రికార్డును ఐదుగురు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు ఆరో ప్లేయర్‌గా సింధు నిలిచింది. భారత్ తరఫున ఈ ఘనత నెలకొల్పింది సింధునే. కాగా, ఇండోనేషియా మాస్టర్స్‌లో తాజాగా జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో లైన్ హోజ్మార్ను ఎదుర్కొన్న సింధు 21-19, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. గేమ్' లో తొలి నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన సింధు, ప్రత్యర్థిని రెండు సెట్లలో చిత్తు చేసింది. దీంతో 43 నిమిషాల్లో ఆట ముగిసింది. కాగా, లైన్ హోజ్మార్ను సింధు ఇప్పటిదాకా ఆరుసార్లు ఢీ కొట్టగా, అందులో అత్యధికంగా ఐదుసార్లు ఆమెపై నెగ్గడం విశేషం. తాజా విజయంతో సింధు క్వార్టర్ ఫైనల్స్'కు దూసుకెళ్లింది. క్వార్టర్స్"లో చైనా టాప్ సీడ్, వరల్డ్ నెం.4 చెన్ యూఫీతో సింధు తలపడనుంది. ఇప్పటిదాకా సింధు- యూఫీ ఓవరాల్‌గా 13సార్లు ఢీ కొట్టారు. ఈ ముఖాముఖి పోరులో 7-6 తో చైనా యూఫీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరిసారిగా ఈ చైనా క్రీడాకారిణిపై సింధు 2019లో విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి నెగ్గి రికార్డు సమం చేయాలని సింధు భావిస్తోంది. ఈ కొత్త ఏడాదిలో క్వార్టర్ ఫైనల్స్ ఆడడం సింధుకు ఇది రెండోసారి. రీసెంట్గా మలేసియా ఓపెన్‌లో సింధు తృటిలో ఫైనల్? మిస్సైంది. ఈ టోర్నీలో క్వార్టర్స్‌లో యమగుచిపై నెగ్గిన సింధు సెమీన్కు దూసుకెళ్లింది. కానీ, సెమీస్ లో వాంగ్ (చైనా)ను ఢీ కొట్టిన ఆమె 16-21, 15-21 తేడాతో ఓడి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక రెండు వారాల్లోనే మరోసారి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఈసారి కూడా అత్యుత్తమ ప్రదర్శనతో సెమీస్ చేరాలని సింధు భావిస్తోంది. 2009లో సింధు బ్యాడ్మింటన్‌లో అరంగేట్రం చేసింది. తన సుదీర్ఘ కెరీర్ లో ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. ఇప్పటిదాకా కెరీర్లో 732 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 500 మ్యాచ్‌లో నెగ్గింది. ఇందులో 456 విజయాలు BWF టూర్లో సాధించినవే. 2013లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ బ్రాంజ్ మెడల్ నెగ్గింది. ఈ ఛాంపియన్షిప్స్ బ్రాంజ్ నెగ్గిన భారత తొలి షట్లర్‌గా రికార్డు కొట్టింది. అలాగే 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో రన్నరప్లో నిలిచి సిల్వర్ పట్టేసింది. దీంతో భారత్ నుంచి ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఈవెంట్'లో ఫైనల్' చేరిన తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2020 టోక్యో ఒలిపింక్స్ లో బ్రాంజ్ మెడల్ నెగ్గింది.