భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన స్నేహితురాలు సోఫీ షైన్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. చాలా కాలంగా ఇద్దరూ ఒకరినొకరు డేట్ చేస్తున్నారు. మొదట్లో సీక్రెట్‌గా జరిగిన వ్యవహారాన్ని సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు వెల్లడిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా వారి నిశ్చితార్థం విషయాన్ని కూడా చెప్పేశారు. తన నిశ్చితార్థం ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులకు ఈ శుభవార్తను అందించాడు. సోఫీ కంటే ధావన్ 5 సంవత్సరాలు పెద్దవాడు. శిఖర్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేశాడు, ఇందులో శిఖర్, సోఫీ చేతిలో నిశ్చితార్థపు ఉంగరం ఉంది. శీర్షికలో, ధావన్ ఇలా రాశాడు, "నవ్వులు పంచుకోవడం నుంచి కలలను పంచుకోవడం వరకు, మా నిశ్చితార్థం కోసం వచ్చిన ప్రేమ, ఆశీర్వాదాలు, ప్రతి శు భాకాంక్షలకు నేను కృతజ్ఞుడను, ఎందుకంటే మేము కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము." అని రాసుకొచ్చాడు. సోఫీ ఐర్లాండ్‌కు చెందిన యువతి. ఆమె ఒక ప్రోడక్ట్ కన్సల్టెంట్. ప్రస్తుతం ఆమె అబుదాబిలోని ఒక కంపెనీలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె 1990లో జన్మించింది, ప్రస్తుతం ఆమె వయస్సు 36 సంవత్సరాలు. లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, మేనేజ్మెంట్లో చదువు పూర్తి చేసింది. 2023లో శిఖర్ ధావన్‌కు చాలా. ఇబ్బందికరమైన సమస్యలు వచ్చాయి. బ్యాడ్ టైం నడిచింది. మొదటి భార్య ఆయేషా ముఖర్జీ వివాదాలు సాగాయి. కలిసి జీవించలేమని గ్రహించి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కుమారుడికి దూరం కావడంతో శిఖర్ ధావన్ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. వాటిని ఏమాత్రం తనలో దాచుకోలేదు. వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన ఆలోచనలు పంచుకుంటూ పోస్ట్‌లు పెట్టాడు. కట్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ధావన్ సోఫీ షైన్‌తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ టోర్నమెంటు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ భారత్ ఆ దేశం వెళ్లలేదు. తన మ్యాచ్‌లను దుబాయ్ లో ఆడింది. దుబామ్లోని ఒక రెస్టారెంట్లో సోఫీ షైన్‌ను మొదటిసారి కలిసినట్లు ధావన్ చెప్పారు. ఆ రోజున కామోప్లాజ్ ట్రౌ జర్స్, జాకెట్లో సోఫీ చాలా అందంగా కనిపించిందని క్రికెటర్ చెప్పాడు. మొదటి సమావేశం గురించి మాట్లాడుతూ, ధావన్ అందమైన ముఖం, అల్లరి కళ్ళతో ఆకర్షితుడైనట్లు సోఫీ చెప్పారు. నిశ్చితార్థం చేసుకున్న శిఖర్ ధావన్ సోఫీ షైన్ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు కూడా చేస్తున్నారు. ధావన్ అతనితో చాలా ఫన్నీ వీడియోలను షేర్ చేశాడు. వార్తల ప్రకారం, వచ్చే నెలలో శిఖర్, సోఫీ వివాహం జరగనుంది.