20 రోజులుగా వేటకు వెళ్లి ఆచూకీ కరువు..
నిలిచిపోయిన సమాచార వ్యవస్థలు
కాకినాడ జిల్లా సుబ్బంపేటకు చెందిన ఏడుగురు
మత్స్యకారులు గల్లంతు ఈ నెల 4న ఉప్పాడ నుంచి
బోటులో సముద్రంలోకి వెళ్లిన జాలర్లు 19న పారాదీప్
సమీపంలో ఉన్నట్లు కుటుంబాలకు చివరి సమాచారం
ఆ తర్వాత నిలిచిపోయిన ఫోన్లు.. పనిచేయని జీపీఎస్
వ్యవస్థ కోస్ట్ గార్డ్ నౌకలు, హెలికాప్టర్లతో ముమ్మర గాలింపు
గాలింపులో అలసత్వం వద్దని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సముద్రాన్ని అణువణువూ జల్లెడ పట్టాలి: పవన్ కల్యాణ్
అమరావతి : కాకినాడ జిల్లా ఉప్పాడ సమీపంలోని సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ నెల 4న మోటరైజ్డ్ ఫిషింగ్ బోటులో వేటకు వెళ్లిన వారు 19వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. పారాదీప్ పోర్టుకు సమీపంలో ఉన్నట్లు చివరిసారిగా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వారి ఫోన్లు పనిచేయకపోవడంతోపాటు బోటులోని ట్రాన్స్‌పాండర్ స్విచ్ కూడా నిలిచిపోయింది. దీంతో జీపీఎస్ ద్వారా కూడా ఆచూకీ తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. పారాదీవ్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో బోటు గల్లంతై ఉ ండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒడిశా కోస్టార్డ్, ఎంఆర్సీసీ సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కోస్టార్డ్ నౌకలు, హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలిస్తున్నారు.
గాలింపు ముమ్మరం చేయాలి: సీఎం
మత్స్యకారుల ఆచూకీ గుర్తించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం గాలింపు చర్యలపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్టార్డ్ అధికారుల సహకారంతో అన్వేషణ కొనసాగుతోందని అధికారులు వివరించారు. గాలింపులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం స్పష్టం చేశారు.
అణువణువూ జల్లెడ పట్టాలి: పవన్
గల్లంతైన మత్స్యకారుల వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. సముద్ర ప్రాంతాన్ని అణువణువూ జల్లెడ పట్టి గాలింపు చేపట్టాలని ఆదేశించారు. కుటుంబాలకు ధైర్యం చెప్పాలని సూచించారు.
క్షేమంగా తిరిగొస్తారు: కుటుంబాల ఆశ
బోటులో 1,500 లీటర్ల డీజిల్, 30 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయని మత్స్యకారుల కుటుంబ సభ్యులు తెలిపారు. తమవారు క్షేమంగా తిరిగి వస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావంతో బోటు దారి తప్పి ఉండవచ్చని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.