చైనా మాస్టర్స్ టైటిల్ సొంతం
భారత స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సంచలనం సృష్టించారు. ప్రతిష్ఠాత్మక చైనా మాస్టర్స్ సూపర్ 750 పురుషుల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. షెన్న్లోని ఆరీనాలో ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో చైనా జోడీ హీ జి టింగ్, రెన్ జియాంగ్ యూపై 11-21, 21-13, 21-17 తేడాతో అద్భుత విజయం సాధించారు. గంటా 10 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. తొలి గేమ్ లో చైనా జోడీ తమ వేగం, తెలివైన షాట్లతో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో సాత్విక్-చిరాగ్ 11-21 తేడాతో సులభంగా గేమ్‌ను కోల్పోయారు. అయితే, రెండో గేమ్‌లో భారత ద్వయం అద్భుతంగా వుంజుకుంది. తమ అనుభవాన్ని రంగరించి, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి 21-15తో గేమ్‌ను గెలిచి మ్యాన్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లారు. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత చైనా జోడీ 4-0 ఆధిక్యంతో దూకుడుగా ప్రారంభించినా, సాత్విక్-చిరాగ్ ఏ దశలోనూ పట్టు వదల్లేదు. స్కోరు 17-17తో సమమైన కీలక దశలో భారత ద్వయం వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 21-17తో గేమ పాటు మ్యాచ్‌ను, టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో సింగపూర్ ఓపెన్ తర్వాత సాత్విక్ చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కావడం విశేషం. ఇటీవలి టోర్నీలలో నిరాశపరిచినప్పటికీ, ఈ విజయంతో వారు తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. భుజం నొప్పితో సాత్విక్, వెన్ను నొప్పితో చిరాగ్ బాధపడుతున్నా... గాయాలను లెక్కచేయకుండా వారు ప్రదర్శించిన పోరాట పటిమ అభిమానులను ఆకట్టుకుంది.