సంక్రాంతికి హిట్ కొట్టడం వేరు.... అలాంటిది ఆ పండగకు వచ్చిన ప్రతిసారి విజయం అందుకున్నారు హీరో శర్వానంద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి. పొంగల్ రిలీజ్.. అనిల్‌కు సెంటిమెంట్‌గా మారింది. వీలుంటే ప్రతి ఏడాదీ వండగకు వస్తాననంటుంటారు. సంక్రాంతికి వచ్చిన సినిమాలే కాదు అనిల్ తెరకెక్కించిన ఇతర సినిమాలన్నీ హిట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఎంతోమంది మేకర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ, అది కొన్నిసార్లు వర్కౌట్ కాదు. దీంతో, కొన్ని సినిమాలు అకస్మాత్తుగా. విడుదలవుతుంటాయి. సాధారణ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. చిన్న చిత్రాల మేకర్స్ వాటిని విడుదల చేసేందుకు సాహసించరు. పెద్ద పండగకు తప్పని సరిగా ప్రేక్షకులు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో రిలీజ్ చేస్తుంటారు. అలా ఈ ఏడాది విడుదలైన ప్రభాస్ 'ది రాజాసాబ్', చిరంజీవి సినిమా, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో పాటు శర్వా మూవీ, నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక చేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా 'ఎక్స్ ప్రెస్ రాజా' తో 2016లో శర్వా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రేమించిన అమ్మాయి పెంచుకున్న కనిపించకపోవడంతో.. దాన్ని వెతికి పట్టుకునే క్రమంలో హీరోకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అన్న పాయింట్‌తో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ఇది. మరుసటి ఏడాది సంక్రాంతికి సందడి కుక్క 'శతమానం భవతి'తో అంతకుమించిన సక్సెస్ చూశారు శర్వానంద్. కుటుంబ విలువలు గుర్తుచేసేలా సతీశ్ వేగేశ్న తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ ఏడాది 'నారీ నారీ నడుమ మురారి' గా నవ్వులు పంచారు. ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి కథాంశంతో రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తోంది. ఈ మూడు సినిమాలు జనవరి 14న విడుదల కావడం విశేషం. ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేశ్, వరుణ్ తేజ్. కాంబినేషన్లో ఆయన తెరకెక్కించిన 'ఎఫ్ 2' 2019 జనవరి 12న రిలీజైంది. ఈ మూవీ రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. 2020 జనవరి 11న విడుదలైన మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు' దాదాపు రూ.200 కోట్లు రాబట్టింది. 2025 జనవరి 14న విడుదలైన వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసి, ఈ హీరో- దర్శకుడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ నెల 12న విడుదలైన చిరంజీవి 'మన శంకరవర ప్రసాదారు' సైతం జోరు ప్రదర్శిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.152 కోట్లు కలెక్ట్ చేసింది.