స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సరికొత్త అవతారమెత్తింది. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం అనే వంటల రియాలిటీ షోకు ఆమె వ్యాఖ్యాతగా (హో) వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ షోతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా సమంత మారును.. "ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. చిన్నప్పుడు మా ఇంట్లో 'మాస్టర్ 'చెఫ్' ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాంటివి. నేను, మా అమ్మ కలిసి ఈ షో చూసేవాళ్లం. అవి మా బంధాన్ని మరింత బలపరిచింది. ఎన్నో ఏళ్ల తర్వాత షోకు నేను సెలబ్రిటీ హోస్ట్ వస్తానని కలలో కూడా ఊహించలేదు. ఇది నిజంగా చాలా స్పెషల్" అని భావోద్వేగంగా పేర్కొంది. కుటుంబ మంతా కలిసి వీక్షించేలాంటి ఒక మంచి టీవీ షోలో భాగం కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని. 'మాస్టర్ చెప్తా' అందుకు సరైన వేదిక అని సమంత అభిప్రాయపడింది. ఆహారం సునుషులకు దగ్గర చేయడమే కాకుండా, మధుర జ్ఞాపకాలను పంచుతుందని ఆమె పేర్కొంది. ఈ షోకు చెఫ్ వెంకటేష్ బట్, చెఫ్ శశి చెలియా చెఫ్ శ్రీయ అబ్యా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి సోనీ జ ఛానెల్ పాటు సోసిస్ లిన్ ఓటీటీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది .