స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి, అభిమానులకు మరిచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల తాను గర్భవతినని వెల్లడించిన సమంత, ఇప్పుడు తొలిసారిగా బేబీ బంద్ తో ఉన్న అధికారిక ఫొటోను పంచుకోవడంతో నెట్టింట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ తాజా చిత్రంలో ఆమె మస్టర్డ్ యెల్లో రంగు కేప్ గౌన్ , టర్కాయిన్ డ్రాప్ ఇయర్ రింగ్స్, స్టైలిష్ బన్ హెయిర్టెల్తో ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒకవైపు కెరీర్లో వరుస విజయాలను సాధిస్తూనే, మరోవైపు మాతృత్వపు తీపి అనుభూతిని స్వాగతించేందుకు సమంత సిద్దమవుతున్నారు. ఇటీవల తన భర్త, దర్శకనిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డకు స్వాగతం వలకబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆమె నేరుగా బేబీ బంప్ ఫొటోను షేర్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మరోవైపు, వృత్తిగత జీవితంలోనూ సమంత విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. సమంత సోలో హీరోయిన్గా నటించిన చిత్రాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది సరికొత్త చరిత్ర సృష్టించింది. రాబోయే రోజుల్లో సమంత పూర్తి ఆరోగ్యంతో ఉంటూ, ఈ కొత్త జీవితంలోకి సంతోషంగా అడుగుపెట్టాలని కోరుకుంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రార్థనలు, శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.