ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిందనే విషయం తెలిసిందే. కలెక్షన్స్, రికార్డుల పరంగా ఈ సినిమా కొత్త బెంచ్మార్న్లను సెట్ చేసినప్పటికీ, ఆ సినిమాలో నటించిన ఒక నటి అనుభవం మాత్రం మరో కోణాన్ని బయట పెడుతోంది. గ్లామర్, గ్రాండ్‌నెస్ వెనుక దాగి ఉన్న ఎడిటింగ్ రియాలిటీ పై ఈ సంఘటన చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో చర్చలోకి వచ్చిన పేరు దివి. బిగ్‌బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ, చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి ముందుకు సాగింది. మహర్షి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించిన దివి, తర్వాత అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఆమెకు పుష్ప 2లో ఛాన్స్ రావడం తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించింది. పుష్ప2 సినిమాలో దివి రిపోర్టర్ గా కనిపించింది. తనకు కథ చెప్పేటప్పుడు ఆమె పాత్ర కథలో కీలకంగా ఉ ంటుందని చెప్పారని, టీజర్ లో కూడా ఆమె కనిపించడంతో, సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్ బలంగా ఉంటుందని నమ్మానని దివి చెప్పింది. కానీ ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం పూర్తిగా భిన్నంగా మారింది. తాను ఈ సినిమా కోసం దాదాపు 20 రోజుల షూటింగ్, మరో 10 రోజుల డబ్బింగ్ చేసినప్పటికీ, ఫైనల్ కట్లో ఆమె పాత్రను చాలా వరకు ఎడిటింగ్ చేశారని, థియేటర్లో సినిమా చూసినప్పుడు, తన సీన్స్ చాలా తక్కువగా ఉ ండటంతో షాక్‌కు గురయ్యానని ఆమె వెల్లడించింది. టీజర్లో చూపించిన కొన్ని సీన్స్ కూడా సినిమాలో లేకపోవడం ఆమెకు మరింత నిరాశ కలిగించిందని తెలిపింది. ఈ సంఘటనతో మరోసారి సినిమా ఎడిటింగ్ ప్రక్రియపై దృష్టి పడుతోంది. పెద్ద సినిమాల్లో రన్‌టైమ్, పేసింగ్ వంటి అంశాల దృష్ట్యా ఎన్నో సీన్స్ లాస్ట్ మినిట్ లో తొలగించడం సాధారణమే. అయితే ఈ ప్రక్రియలో కొత్తగా ఎదుగుతున్న ఆర్టిస్టులు తమ పాత్రలపై పెట్టుకున్న ఆశలు ఛిన్నాభిన్నం కావడం కూడా తరచూ కనిపించే వాస్తవం. దీవి తన స్నేహితులను కూడా థియేటర్ కు తీసుకెళ్లిన సందర్భంలో, తన పాత్ర కేవలం కొన్ని సీన్స్‌కే పరిమితం కావడం తనను నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ ఇలాంటి విషయాలు ఇండస్ట్రీలో సాధారణమే... ముందుకు సాగాల్సిందేనంటూ ఆమె చెప్పిన మాటలు, ఒక ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ మైండ్సట్ను ప్రతిబింబిస్తున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే పుష్ప2 లాంటి భారీ విజయాల వెనుక కూడా వ్యక్తిగత స్థాయిలో కొన్ని అసంతృప్తులు దాగి ఉంటాయని ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది.