రాష్ట్ర హోం మంత్రి అనిత
పాయకరావుపేట, : పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్ విస్తరణలో భాగంగా సీసీ కాలువలు, కల్వర్టుల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులకు గురువారం ఆమె శంకుస్థావన చేశారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.8.20 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. వసులను పారదర్శకంగా, నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాయకరావుపేట పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం పాయకరావుపేట మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన ఎన్ఎంసీ చైర్మన్లను మంత్రి అనిత నన్మానించారు. పాఠశాలల అభివృద్ధిలో ఎన్ఎంసీ చైర్మన్లు పోటీ పడాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు, పాఠశాలల్లో ఆర్థిఓ ప్లాంట్లు లేని చోట కొత్తగా ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే ఉన్న ఆర్ ఓ ప్లాంట్లు మరమ్మతులకు గురైతే వాటిని రిపేర్ చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వీఎంఆర్డీఏ ఎస్ఈ ఎన్. రాంబాబు, డీఈ రామానాయుడు, ఏఈ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.