టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి వన్డే సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడా? టీ20 జట్టు నుంచి తప్పించిన శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్సీపై వేటు పడనుందా? అంటే సోషల్ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాదే కెప్టెన్ గా రోహిత్ శర్మ ప్రయాణానికి తెరదించుతూ.. కొత్త కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనతో శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో సెలెక్టర్లు వివరణ ఇచ్చారు. వన్డే ప్రపంచకప్ 2027 వరకు కోహ్లి, రోహిత్ జట్టులో కొనసాగడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొత్త సారథిని సిద్ధం చేయాలనుకున్నామని చెప్పారు. శుభ్‌మన్ గిల్‌కు వన్డే సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే శుభ్‌మన్ గిల్ ఇటీవల పేలవ ఫామ్ తో పాటు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. దాంతో అతను టీ20 ప్రపంచకప్ 2026 ఎంపిక చేయలేదు. టీమ్ కాంబినేషన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఈ క్రమంలో ఓ సోషల్ మీడియా పోస్ట్ నెటిజన్లలో గందరగోళం స్పృష్టించింది. రోహిత్ శర్మను తిరిగి భారత వన్డే సారథిగా నియమించేందుకు బీసీసీఐ సిద్ధమైందని, ఇప్పటికే ఈ విషయమై రోహిత్ శర్మతో మాట్లాడిందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. వన్డే ప్రపంచకప్ 2027లో టీమిండియాను రోహిత్ శర్మనే నడిపించబోతున్నాడని పేర్కొన్నారు. 'కెప్టెన్ రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్. సెలెక్టర్లు అతనితో మాట్లాడుతున్నారు. ప్రపంచకప్ నేపథ్యంలో వన్డే సారథ్య బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు.' అని ఆ పోస్ట్ లో తెలిపారు.
50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మకు 2025 సంవత్సరం అద్భుతంగా కలిసొచ్చింది. అతడి కెప్టెన్సీలో భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. ఫైనల్లో న్యూజిలాండ్‌పై రోహిత్ 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అందుకుగానూ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రోహిత్ శర్మ ఈ ఏడాది షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న ఒక పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ గత 10 సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఖాతాలో ప్రస్తుతం 355 వన్డే సిక్స్‌లు ఉన్నాయి. అఫ్రిది 351 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ శర్మ సేనా దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. అతను మొత్తం 14 వన్డే సెంచరీలు సాధించాడు. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ (15,933). ఓపెనర్ గా భారత్ తరపున సంయుక్తంగా అత్యధిక సెంచరీలు (45). సచిన్ సైతం ఓపెనర్ గా ఇదే రికార్డ్.