తిలక్ వర్మకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ
దులీప్ ట్రోఫీ ఫైసల్ మ్యాచ్ నాలుగో రోజు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సౌత్ జోన్ కెప్టెన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మతో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మైదానంలో వాగ్వాదానికి దిగాడు. ఈ ష్యూచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్ జోన్ విజేతగా నిలిచి, 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టైటిల్ ను కైవసం చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో సౌత్ జోన్ ఇన్నింగ్స్ సందర్భంగా తిలక్ వర్మ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ సమయంలో వైభవ్ అతడిని మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం (స్లెడ్జింగ్) చేశాడు. తొలిరోజు తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తిలక్ తనను స్లెడ్జింగ్ చేసినందుకు బదులు తీర్చుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ భుజం. తిలక్‌కు తగలడంతో సౌత్ జోన్ కెప్టెన్ అంపైరు ఫిర్యాదు చేశాడు. అంపైర్ పచ్చి వైభవ్ తో మాట్లాడుతుండగా.. "సార్, ఫస్ట్ ఇన్నింగ్స్ నాతో కూడా ఇలాగే జరిగింది" అని అతను సరదాగా గుర్తుచేశాడు. ఈ ఘటన మైదానంలో కాసేవు ఉత్కంఠ రేపింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్‌ను 325 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. 2012-13 సీజన్ తర్వాత ఈస్ట్ జోను ఇదే తొలి దులీప్ ట్రోఫీ కాపడం విశేషం. ఈ విజయంతో సౌత్ జోన్ వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలన్న ఆశలకు గండిపడింది. ఓటమి తర్వాత సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ పర్మ స్పందించాడు. ఈ ఫలితం నిరాశపరిచిందని, కానీ ఈ గేమ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని చెప్పాడు. "నిజం చెప్పాలంటే, ఈస్ట్ జోన్ మమ్మల్ని పూర్తిగా డామినేట్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 700 పరుగులు ఇచ్చినప్పుడే మ్యాచ్ మా చేజారింది. వారి బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాలి. మేం బౌలింగ్‌లో మరికొంత మెరుగ్గా రాణించాల్సింది" అని తిలక్ వర్మ అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ 99 వరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.