నేషనల్ క్రష్ రష్మిక మందన్నను చూస్తే ఇప్పటివరకు గ్లామర్.. క్యూట్ నెస్.. మోడ్రన్ స్టైల్ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం సుబ్బులక్ష్మి గుర్తొస్తున్నారు! ఒక్క చీర మార్చుకోవడంతో వచ్చిన లుక్ కాదు ఇది.. రోల్ కోసం ఆమె తీసుకుంటున్న ప్రతి చిన్న జాగ్రత్త వల్లనే. కొన్ని రోజుల క్రితం కనిపించిన ఆ లుక్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక రాయల్ బ్లూ పట్టుచీరలో కనిపించిన తీరు నిజంగానే స్పెషల్ గా ఉంది. బంగారు, గులాబీ రంగు బోర్డర్ తో ఉన్న పట్టుచీరకు ట్రెడిషనల్ జ్యువెలరీ, కాసుల పేరు, జుమ్కాలు, ముక్కువుడక, మల్లెపూలు యాడ్ చేశారు. స్టార్ హీరోయిన్ లా కాకుండా.. పాతకాలం నాటి సంగీత విద్వాంసురాలిలా కనిపించేలా ఆ లుక్ ను డిజైన్ చేశారు. అందులో నీలి రంగు చీర మరింత స్పెషల్ గా నిలిచింది. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి స్టైల్ లో నీలి రంగు చీరలకు ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఆ లుక్ మా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముక్కుపుడక, వెనక్కి చక్కగా వేసిన కొప్పు, మల్లెపూలు కూడా ఆమె ఐకానిక్ స్టైల్ ను గుర్తుచేస్తున్నాయి. ఆ ఈవెంట్ జరిగి కొన్ని రోజులు అవుతున్నా... ఇప్పుడు రష్మిక, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ లుక్ పై హైప్ పెరిగింది.