Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోడీ ఆయనకు స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులు ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయం నుండి ప్రధాని నివాసం వరకు మోడీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారతదేశానికి ఇది తొలి పర్యటన. ఆయన గౌరవార్థం ప్రధాని మోదీ ఈ రాత్రి ఒక ప్రైవేట్ విందును నిర్వహించనున్నారు.
రష్యా అధ్యక్షుడితో తన సమావేశ ఫోటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్‌ను భారతదేశానికి స్వాగతిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ సాయంత్రం- రేపు మన చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను. భారతదేశం-రష్యా స్నేహం కష్ట సమయాల్లో పరీక్షగా నిలిచింది, మన ప్రజలకు అపారమైన ప్రయోజనాలను తెచ్చిపెట్టింది" అని మోడీ Xలో పేర్కొన్నారు.
ఒకేకారులో . .
విమానాశ్రయం నుంచి పుతిన్ మోడీతో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ఆయన తన కారును వదిలి ప్రధాని మోడీ కారులో ఎక్కారు.గతంలో పుతిన్ చైనాలోని టియాంజిన్‌లో తన లిమోజిన్‌లో మోడీతో పాటు వెళ్లారు. ఢిల్లీలో కూడా మోడీ పుతిన్ ఇదే తరహాలో ఒకే కారులో కలిసి వెళ్లారు. ఆ కారులో ప్రధానమంత్రి మోదీ మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలం విమానాశ్రయం నుండి బయలుదేరిన 7 నిమిషాల తర్వాత ఢిల్లీలోని, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసానికి చేరుకున్నారు.