నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'. మోహన్ బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దీని మొదటి పాటను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా 'ఆయా షేర్' అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. పూర్తి పాట ఫిబ్రవరి 24న రానుంది. అనిరుధ్ అందించిన సంగీతం జోష్ పెంచేలా కనిపిస్తోంది. ఇదిలావుంటే నేచురల్ స్టార్ నాని వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. 'ది ప్యారడైజ్'లో నాని పూర్తిగా కొత్త గెటప్‌లో లో, ఊర మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడం విశేషం. రగ్డ్ స్టైల్, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్ నాని మరోసారి మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. 'దసరా'లో చూపించిన రా ఎనర్జీకి మించి ఈసారి మరింత పవర్ఫుల్ ప్రెజెన్స్ ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.